TG: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. లైంగిక దాడులు జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలు అందులో పొందుపరచాలని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నెలలో ఛార్జ్ షీట్ వేసి, మూడు నెలల్లో శిక్షను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితుడి ఆస్తిలో 50 శాతం బాధితురాలి కుటుంబానికి అందజేయాలని సూచించారు.