చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ అంతరిక్ష యాత్రకు టికెట్లను విక్రయిస్తుంది. 2027లో బయలుదేరనున్న రాకెట్లో రెండు సీట్లను ‘డీప్ బ్లూ ఏరో స్పేస్’ కంపెనీ విక్రయానికి ఉంచింది. అంతరిక్ష యాత్ర అనుభూతిని పొందాలంటే 1.5 మిలియన్ యువాన్లు(రూ.1.77 కోట్లు) చెల్లించాలని ప్రకటించింది. సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తామని స్టార్టప్ కంపెనీ పేర్కొంది.