AP: ఇంద్రకీలాద్రి ఆలయంలో మెట్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. మెట్లపై నీళ్లు పోస్తూ స్వైపర్ క్లీనర్‌తో స్వయంగా కడిగారు. ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రి ఆలయానికి వెళ్లిన పవన్‌కు ఆలయాధికారులు సాదర స్వాగతం పలికారు. పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. కాగా, తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.