»T Congress Leaders Are United Party Will Take The Power
Telangana Congress: నేతల ఐక్యత..గెలుపు ఖాయమేనా?
ఉప్పు నిప్పుగా ఉండే టీ కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. నేతల్లో కనిపిస్తోన్న ఈ ఐకమత్యం ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేయించే అవకాశం ఉంది.
T-congress Leaders Are United, Party Will Take The Power
T-congress: టీ కాంగ్రెస్లో (T-congress) జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపు రాజకీయాలు కానీ.. ఇప్పుడు అవేం కనిపించడం లేదు. తెలంగాణ ఇచ్చింది మేమే.. కానీ అధికారానికి దూరం అయ్యామనే ఫీలింగ్ ఆ పార్టీ నేతల్లో ఉంది. ఈ సారి ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా అందరిని కలుపుకొని పోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోన్న ఐకమత్యం ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తోందా..? వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టనుందా..? హిట్ టీవీ ప్రత్యేక కథనం.
ఉప్పు- నిప్పు
కాంగ్రెస్ పార్టీలో ఏ ముగ్గురు నేతల మధ్య సయోధ్య ఉండదు. ఇదీ ఒకప్పటి మాట అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవీ అప్పగించిన తర్వాత తలో దారిలో ఉండేవారు. ఎవరికీ వారే యుమనా తీరే అన్నచందంగా ప్రవర్తించేవారు. హై కమాండ్ ఆదేశాలు.. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే కృత నిశ్చయంతో విభేదాలు పక్కన పెట్టారు. అందరూ నేతలు కలిసి అన్న, తమ్ముడు అని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐకమత్యం చూసి ఆశ్చర్యం కలుగక మానదు.
నేతల క్యూ..
లోన కొందరు నేతలకు కోపం, కసి ఉంటాయి. పైకి మాత్రం అవేమి చూపించడం లేదు. నవ్వుకుంటూ చక్కగా పనిచేస్తున్నారు. రేవంత్ వ్యతిరేక, అనుకూల వర్గం అనే కథనాలు వినిపించేవి.. అవీ కూడా లేవని చెప్పేందుకు ఇటీవల జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలను తీసుకొని మరీ వెళ్లారు. కాంగ్రెస్ స్ట్రాటజిక్ కమిటీ సమావేశంలో కూడా దాదాపుగా అందరూ నేతలు తమ అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. కలిసికట్టుగా ఉన్నామని తేల్చిచెప్పారు.
ప్రియాంకకు కీలక బాధ్యతలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి పార్టీ వీడుతారని ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. అదేం లేదని ఇద్దరూ నేతలు స్పష్టంచేశారు. దీంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఎవరూ లీకులు ఇచ్చారని తెలియదు.. ఆ గొడవ వెంటనే ముగిసిపోయింది. కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశానికి పిలిచిన నేతలు తప్పకుండా వెళ్లారు. మిగిలిన వారిని రాష్ట్రంలో కలుపుకొని పోతామని రేవంత్ అంటున్నారు. పొంగులేటి, జూపల్లితోపాటు 35 మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారట.. ఇంచార్జీ ఠాక్రే పేరుతో ఆ జాబితా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగనిరీతిలో బలపడుతోందని దీనిని బట్టి అర్థం అవుతోంది. తెలంగాణకు సంబంధించి ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. ఆమె హైదరాబాద్లో ఇల్లు కిరాయి తీసుకొని ఉంటారట. సో.. అందరూ నేతలను కలుపుకొని వెళ్లడమే ఆమె పని.. అలా అయితే మిగతా కొందరు నేతలు కూడా దగ్గరికి వస్తారని.. టీ కాంగ్రెస్లో విభేదాలకు తావు ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒంటెద్దు పోకడలతో కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ ఇలా ఐకమత్యంగా సాగుతుంటే సీఎం కేసీఆర్ (cm kcr) మాత్రం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నిర్లక్ష్యంగా ఉన్నారనే భావన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే కాదు.. తమ పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరపడం లేదట. సీట్ల గురించి అప్పుడప్పుడు లీకులు ఇచ్చి హైప్ క్రియేట్ చేస్తున్నారనే అసంతృప్తి ఉంది. క్షేత్రస్థాయిలో నేతలతో మాట్లాడటం లేదట. మరో 4, 5 నెలల్లో ఎన్నికలు ఉండగా.. ఇప్పటివరకు తమతో సంప్రదింపులు, చర్చలు లేవని కొందరు నేతలు వాపోతున్నారు. మహారాష్ట్ర పర్యటన ఎందుకు అని స్వపక్షంలో ఫైర్ బ్రాండ్స్ చెవులు గొణుక్కుంటున్నారు. సో.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తాయి. బీజేపీకి (bjp) కూడా కొద్దో గొప్పో సీట్లు పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ (brs), కేసీఆర్ (kcr) ధీమా కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.