దానిమ్మ (Pomegranate) గింజలలో అనేక పోషకలు ఉన్నాయి. కేవలం రుచిగా ఉండే ఫలంగానే కాకుండా మనలోని అనేక రకాల వ్యాధులను నివారించే దివ్య ఔషధంగా దానిమ్మ ఉపయోగపడుతుంది. దానిమ్మలో పొటాషియం(Potassium), విటమిన్ “ఏ” విటమిన్ “సి” విటమిన్ “బి 6”, ఫోలిక్ యాసిడ్ (Folic acid) పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సెర్ , రాకుండా కాపాడుతాయి. గింజలలో ఉన్న పోషకాలతో పాటుగా ఈ చెట్టు ఆకులు, పువ్వులూ, గింజల మధ్యలో ఉండే పలుచని పొరలు చివరికి ఈ చెట్టు బెరడు కూడ ఎన్నో ఔషద గుణాలతో ఉన్నవే. భారతీయ గ్రంధాలలో హిమాలయ ఫలంగా దానిమ్మ ప్రస్తావన ఉంది. మనిషి ఆరోగ్యాన్ని కాపాడే దానిమ్మ గింజల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్(Protein), 30 శాతం విటమిన్ సి, 16 శాతం ఫోలేట్ మరియు 12 శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండులో 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తెలింది.రక్తహీనత(Anemia)తో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లతో జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని తేలింది.
క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అల్జీమర్స్ (Alzheimer’s)వ్యాధిని నివారించొచ్చని డాక్టరులు చెబుతున్నారు.చాలామంది నైట్ దానిమ్మ తింటే జలుబు చేస్తుందని, కఫం ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఒట్టి అపోహ మాత్రమే. రాత్రి పడుకునే ముందు దానిమ్మ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్(Pomegranate juice)లో ఒక టీ స్పూన్లో అల్లం వేసుకొని తాగితే కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా ధృడంగా తయారవుతాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగు తీసుకుంటే నాణ్యమైన నిద్రపడుతుంది. రాత్రిపూట దానిమ్మను తింటే ఉదయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity)బలపడుతుంది.