»Pakistan Pm Trolled For Taking Umbrella From Female Usher She Gets Drenched In Rain
Shehbaz Sharif:మహిళా అధికారిణి చేతిలో నుంచి గొడుగు లాక్కొన్న ప్రధాని
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా నడుచుకోవాలో నెర్చుకోవాలని సూచిస్తున్నారు.
Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా నడుచుకోవాలో నెర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంతగా ప్రధానిని ఆడిపోసుకోవడానికి కారణం ఏంటంటే.. షెహబాజ్ షరీఫ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ (France) వెళ్లారు. పారిస్ (Paris)లో జరిగిన ఓ సదస్సుకు షెహబాజ్ హాజరయ్యారు. అయితే సదస్సుకు వెళ్లే సమయంలో వర్షం పడుతుంది. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా అధికారిణి గొడుగు (umbrella) తీసుకుని ప్రధాని కారు వద్దకు వచ్చారు.
షెహబాజ్ కారు దిగిన వెంటనే ఆయన తడవకుండా ఆమె అతనికి గొడుగు పట్టారు. అయితే, ప్రధాని ఆమె చేతిలో ఉన్న గొడుగును లాక్కొని లోపలికి వెళ్లిపోయారు. ఒక్కసారిగా ఆయన అలా ప్రవర్తించడంతో ఆమె నిశ్చేష్టురాలైంది. దీంతో సదరు మహిళా అధికారిణి వర్షంలో తడుస్తూనే షెహబాజ్ వెనుక నడుస్తూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ప్రధాని షెహబాజ్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Prime Minister Muhammad Shehbaz Sharif arrived at Palais Brogniart to attend the Summit for a New Global Financial Pact in Paris, France. #PMatIntFinanceMootpic.twitter.com/DyV8kvXXqr
Why did he leave the woman in the rain? Shehbaz sharif is such an embarrassment. Yaaar kis cartoon ko PM bana diya hai inho ne. 😂 pic.twitter.com/kPzOmXSvQG