• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆర్థికశాఖ పెత్తనం జగన్‌దే.. యనమల వ్యాఖ్యలపై బుగ్గన ఫైర్

సీఎం జగన్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? అని యనమల ...

February 5, 2023 / 04:13 PM IST

చైనా బజార్లు పోవాలి.. భారత్ బజార్లు రావాలి : కేసీఆర్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...

February 5, 2023 / 04:11 PM IST

చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్రానికి చేస్తాడా?: లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనే అన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పెన్షన్లు తీసేయడం, మద్య...

February 5, 2023 / 04:09 PM IST

గర్వంగా, గౌరవంగా ఆస్తులు సంపాదించుకున్న..శిల్ప రవి ఫైర్

నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రవి అక్రమాలు చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే ధీటుగా స్పందించారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరారు. తన ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. తాను గౌరవంగా, గర్వంగా ఆస్తులు సంపాదించుకున్నానని శిల్ప రవి వివరించారు. తన ఇల్లు, నంద్యాల ఆస్తులకు సంబ...

February 5, 2023 / 03:43 PM IST

స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం..నెల రోజులు రెస్ట్

ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్‌లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యులు తనను నెల రోజుల పాటు విరామం తీసుకోమన్నట్లు పేర్కొన్నారు.   View this post on Instagram   A post shared by […]

February 5, 2023 / 03:32 PM IST

రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే.. రైతుల ప్రభుత్వం రావాల్సిందే : నాందేడ్‌లో కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు...

February 5, 2023 / 03:24 PM IST

ఇండియాలో 232 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత్ షాకిచ్చింది. ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆదివారం ఆ 232 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 232 యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. అలాగే 94 లోన్ యాప్‌లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ యా...

February 5, 2023 / 03:05 PM IST

మద్యం సేవించి భార్యను కొట్టిన మాజీ క్రికెటర్

  మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరోపించింది. ఆండ్రియా తర్వాత వైద్య పరీక్షల కోసం భాభా ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ...

February 5, 2023 / 02:57 PM IST

రైతులు, నిరుద్యోగుల గోడు వినిపించడం లేదా?: షర్మిల ఫైర్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై షర్మిల విమర్శించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చిన్న దొర అంటూ స్టార్ట్ చేశారు. ‘చిన్న దొర కుటుంబ పాలన అంటున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అట.. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారని అడిగారు. మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుచేశారు. రుణం మాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. వారి గోడు ...

February 5, 2023 / 02:04 PM IST

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. దసరా సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నగా సిట్ భగ్నం చేసింది. జాహైద్, ఫారూఖ్, సమియుద్దీన్‌‌ను అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ ఇప్పుడు కేసు నమోదు చేసింది. పాకిస్థాన్, నేపాల్ మీదుగాపేలుడు పదర్థాలను మనోహరాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హ...

February 5, 2023 / 01:32 PM IST

ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు రిలీజ్

ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సివిల్‌ కానిస్టేబుళ్లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6500పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన...

February 5, 2023 / 01:31 PM IST

మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్ రాజకీయాల్లో బచ్చా అంటూ విరుచుకుపడ్డారు.‘‘డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు...

February 5, 2023 / 01:18 PM IST

సునీత భర్త చాలా తెలివైనవాడు.. నటుడు వేణు కామెంట్స్ వైరల్

‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో వేణు అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చిరునవ్వుతో, హనుమన్ జంక్షన్ ,చెప్పవే చిరుగాలి, వంటి సినిమాలతో పేక్షకులకు చేరువయ్యాడు. వేణు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో వేణు తొట్టెంపూడి మొదట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు. వడ్డే నవీవ్, నేను, సిమ్రాన్, సునీత భర్త మ్యాం...

February 5, 2023 / 01:08 PM IST

బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ మృతి, కేసీఆర్ సంతాపం

బీఆర్ఎస్ నేత, ఒడిశా మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రైతుల సమావేశంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లాలో శనివారం ఉదయం అతని బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. బారుహాన్ సమీపంలో ఖరస్రోటా నదిపై ఉన్న వంతెన మీదుగా అర్జున్ దాస్ వెళ్తున్నారు. అటు వైపు వచ్చిన ట్రక్.. వేగంగా ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ దాస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించార...

February 5, 2023 / 12:49 PM IST

హైదరాబాద్- విజయవాడ రూట్ లో ప్రయాణం చేస్తున్నారా … బిగ్ అలర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్ -విజయవాడ రూట్. జాతీయ రహదారిపై 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆంక్షలను విధించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు తగిన సూచనలు, మళ్లింపు మార్గాలను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ సవివరంగా వెల్లడించారు. హైదరాబా...

February 5, 2023 / 12:25 PM IST