దాపు మూడేళ్ల తర్వాత చేప ప్రసాదం (fish medicine) పంపిణీకి ముహుర్తం ఖరారైంది. జూన్ 9న మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేయనున్నారు
సెక్స్ వర్కర్ల(Sex Workers)కు కూడా చట్ట ప్రకారంగా గౌరవం, సమాన రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. వారి ఇష్టానుసారంగా వేశ్యగా మారడం చట్టవిరుద్దం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఒక్కసారిగా వరద పోటెత్తడంతో దుకాణం మూసేయడానికి కూడా అవకాశం లభించలేదు. వరద దుకాణంలోకి పోటెత్తడంతో బంగారు, వజ్రాభరణాలు, డబ్బు నీటిలో కలిసిపోయాయి. నగలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్(sai dharam tej) తో కలిసిన నటిస్తున్న చిత్రం బ్రో(BRO). ప్రముఖ నటుడు సముద్రఖని(samudra khani) దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మే22న తుదిశ్వాస విడిచారు. కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు.
ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా మేకలను బలి ఇచ్చిన కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు ఐపీఎల్ నుంచి వైదొలగింది. మరోసారి నిరాశ ఎదురవడంతో బెంగళూరు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంచనాలు అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వినియోగంతో డబ్బు ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) CSE 2022 పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను అధికారులు ప్రకటించారు. మే 23, 2023న తన అధికారిక వెబ్‌సైట్ లో రిలీజ్ చేశారు.
కూరగాయలు కొంటున్న వారి దగ్గరకు వెళ్లి ఓ నిమ్మకాయను తీసుకుని దాన్ని ఓ కవర్ లో పెట్టి పక్షి ఎగిరినట్టు ఎగిరేలా చేశాడు ఓ మాంత్రికుడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడి(Rs 2000 note exchange) ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియను కొంత సులభతరం చేయడానికి బ్యాంకులు రూ. 2000 కరెన్సీ నోట్లను చిన్న డినామినేషన్‌లకు మార్చుకోవడానికి ప్రత్యేక కౌంటర్లను కేటాయించాయి. 2000 రూపాయల కరెన్సీ నోట్లను మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.