• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు

TG: రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం డెడికేషన్‌ కమిషన్‌ను‌ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ భూసాని వెంకటేశ్వరరావును నియమిం​చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

November 4, 2024 / 08:03 PM IST

జిల్లా విద్యాశాఖ అధికారిగా నాగ జ్యోతి

NRML: నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా నాగ జ్యోతిని నియమిస్తున్నట్లు రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఇక్కడ డీఈవోగా పని చేసిన రవీందర్ రెడ్డిని మహబూబాబాద్ జిల్లా డైట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. కాగా డీఈఓ నాగజ్యోతి ఇది వరకు నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

November 4, 2024 / 08:01 PM IST

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీమంత్రి

TPT: కార్తీక మాసం సందర్భంగా దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.

November 4, 2024 / 07:57 PM IST

లేడీ అఘోరీ హల్ చల్

AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లేడీ అఘోరీ హల్ చల్ సృష్టించింది. వేంపాడు ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లింపుపై అఘోరీకీ, టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అఘోరీకి సర్దిచెప్పిన పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.

November 4, 2024 / 07:57 PM IST

బ్యూటిషన్ కోర్సులో ఉచిత శిక్షణ

NLG: పోచంపల్లి మండలం జలాల్పూర్ లోనే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో రెండు నెలలపాటు పదవ తరగతి పాసైన నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్ కోర్సులో హాస్టల్ ,భోజన వసతి, ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువతులు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

November 4, 2024 / 07:56 PM IST

లింగంపేటలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమం

Akp: గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీలో సోమవారం స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే తమ పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్పీ రమణ పాల్గొన్నారు.

November 4, 2024 / 07:56 PM IST

‘సర్వేను పకడ్బందిగా నిర్వహించాలి’

NZB: బోధన్ పట్టణంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై సోమవారం తహశీల్దార్ విఠల్ ఎన్యూమలేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేను పకడ్బందిగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, సాలూర తహశీల్దార్ శశిభూషణ్, ఎంపీవో మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

November 4, 2024 / 07:55 PM IST

కులగణన సర్వే శిక్షణ తరగతులను పరిశీలించిన కలెక్టర్

JN: స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో జరిగిన కులగణన సర్వే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు వారి బాధ్యతలు వారు విధిగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

November 4, 2024 / 07:52 PM IST

ఎస్సీ, ఎస్టి విద్యార్థుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా కాసర్ల లింగస్వామి

NLG: బుద్ధారం గ్రామానికి చెందిన కాసర్ల లింగస్వామిని, సోమవారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ నియామక పత్రం అందజేశారు. లింగస్వామి మాట్లాడుతూ.. విద్యా, వైద్యం, నిరుద్యోగ సమస్యల పైన, ఫీజు రియంబర్స్ మెంట్ కొరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమస్యలపై, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని అన్నారు.

November 4, 2024 / 07:52 PM IST

అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్

AP: అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు తేదీ ఖరారు అయింది. ఈనెల 11న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ విడుదల చేశారు. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఏన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై BAC సమావేశంలో నిర్ణయం తీసుక...

November 4, 2024 / 07:51 PM IST

దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్సీ రూ. లక్ష విరాళం

MBNR: షాద్ నగర్ మున్సిపాలిటీలోని జానంపేటలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి రూ. లక్ష విరాళం ప్రకటించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ మహోత్సవంలో జరుగు ఖర్చులు కూడా భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు.

November 4, 2024 / 07:49 PM IST

ఉద్యోగం ఇస్తానని మోసం.. పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు

PLD: నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన ఘటనపై రెంటచింతల మండలం ఎర్రబాలెంకి చెందిన షేక్ మస్తాన్ ఫిర్యాదు చేశారు. మస్తాన్ పేరేచర్లలో SSC ఎగ్జామ్‌కి వెళ్లిన సమయంలో లోకేశ్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ అని పరిచయం చేసుకుని ఉద్యోగం ఇస్తానని నమ్మించాడు.

November 4, 2024 / 07:48 PM IST

కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: హర్షసాయి తరపు లాయర్

యూట్యూబర్ హర్షసాయి మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తరపు లాయర్ నామాల శ్రీనివాస్ ఆరోపించారు. ‘హర్షసాయి బిజినెస్ పని నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చాడు. లైంగిక వేధింపుల కేసుకి అతని టూర్‌కి సంబంధం లేదు. విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అన్ని విషయాలు ఇప్పుడే చెప్పలేం. నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి’ అని పేర్కొన్నారు.

November 4, 2024 / 07:47 PM IST

నాణ్యత ప్రమాణాలు పాటించండి: కమిషనర్

NLR: బుచ్చి నగర పంచాయతీ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నగర పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు కమిషనర్ సూచించారు.

November 4, 2024 / 07:45 PM IST

అర్ధరాత్రి అనుకోకుండా మెలుకువ వస్తోందా..?

అర్ధరాత్రి నిద్రలో మెలకువ రావడం సర్వసాధారణం. కానీ, ఇలా పదే పదే వస్తే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామందికి అర్థరాత్రి 12 గంటల కంటే ముందే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ, కొద్దిసేపటి తర్వాత మెలుకువ వస్తుంటుంది. ఒక్కసారిగా నిద్రలేచిన తర్వాత అస్సలు నిద్రపట్టదు. దీనికి కారణం అనారోగ్య సమస్యేనని అంటున్నారు. అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల మధ్యలో మెలుకువ వస్తే కాలేయ సంబంధిత సమస్యకు సంకేతమని అధ...

November 4, 2024 / 07:40 PM IST