VZM: విజయనగరం DEO మాణిక్యం నాయుడును సోమవారం ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతి, కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు, ప్రథాన కార్యదర్శి రమణ, ఆర్ధిక కార్యదర్శి సుకుమార్ కలిసి అపార్ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలపై చర్చించారు.
MDK: గ్రామాల్లో సామాజిక ఆర్థిక సర్వే ప్రక్రియలో 75 ప్రశ్నలకు పూర్తి సమాచారం సేకరించి నమోదు కంగ్టి ఎంపీడీవో సత్తయ్య ఎన్యుమరేటర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సమగ్ర సమాచార సేకరణలో ఏదైనా సందేహాలు ఉంటే మాస్టర్ ట్రైనర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
TG: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2024-25 సంవత్సరానికి గానూ ఈనెల 6న మిగిలిపోయిన సీట్లు భర్తీ చేయనున్నారు. ఉదయం 11 నుంచి 3 గంటలకు బాచుపల్లి క్యాంపస్‌లో స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశాలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ రాధ ప్రకటనలో తెలిపారు. వివరాలకు www.teluguuniversity.ac.in చూడవచ్చు. లేదా 8520866582ను సంప్రదించవచ్చని తెలిపారు.
VZM: వైసీపీ నిర్ణయించిన అభ్యర్థినే గెలిపించాలని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి ఎమ్మెల్సీ ఓటర్లను కోరారు. జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సోమవారం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థినే గెలిపించుకుందామని వార్డు కౌన్సిలర్లకు, దిశానిర్దేశం చేశారు.
NTR: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద 8 అక్రమ ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ జాహ్నవి పట్టుకున్నారు. కీసర మునేటి నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా అవుతున్నట్లు సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ దాడులు నిర్వహించి కీసర టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. వీటన్నిటిపై కేసు నమోదు చేస్తున్నట్లు తహసీల్దార్ జాహ్నవి తెలిపారు.
ప్రకాశం: కనిగిరి మండలం ఏరువారిపల్లిలో బత్తాయి తోటలను కనిగిరి ఉద్యానవన శాఖ అధికారిని ఎం అంజలి భాయ్ సోమవారం పరిశీలించారు. బత్తాయి తోటలను వేరు కుళ్ళు, బంక కారు తెగులుతో పాటు తెల్ల పొలుసు పురుగు ఆశిస్తుందని సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చని రైతులకు తెలిపారు. ఉద్యానవన శాఖ సలహాలు సూచనలు పాటించి తోటలను తెగుళ్ల బారిన పడకుండా కాపాడుకోవాలని తెలిపారు.
యాదాద్రి: పోచంపల్లి మండలంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో రెండు నెలల పాటు పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతులకు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతులు ఈ నెల 11 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రకాశం: వేటపాలెం మండల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సాయంత్రం వేళల్లో పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారు కనిపిస్తే వారిపై కేసు నమోదు చేసి కోర్టలో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు.
TG: జాయింట్ వెంచర్ల అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన కమిటీ కొనసాగుతుందన్నారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపు మార్గాలపై దృష్టి పెట్టాలని భట్టి సూచించారు. జాయింట్ వెంచర్లలో వివాదాలు పరిష్కరించి ఆదాయం పెంచాలని పేర్కొన్నారు.
ప్రకాశం: వెలిగండ్ల సోమవారం సాయంత్రం సురవారిపల్లి వద్ద ఎస్ఐ కె మధుసూధన్ రావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడిపితే మీతోపాటు ఎదుటివారికి ప్రమాదం అని గుర్తుచేశారు. మద్యం సేవించి పట్టుబడితే జరిమానా లేదా జైలు శిక్ష, లేదా రెండూ పడవచ్చని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
AKP: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ శ్యామలరావుకు హోం మంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ వేద పండితులు అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెను రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు.
WNP: వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కొత్తకోట మండలం కానాయపల్లిలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని, మదనాపూర్ మార్కెట్ యార్డులో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
NZB: సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో అక్టోబర్ 31న జరిగిన హత్య కేసును చేధించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు వివరాలను వెల్లడించారు. గంగాధర్ అనే వ్యక్తి కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కృష్ణ వద్ద నుంచి గంగాధర్ తీసుకున్న అప్పును ఇవ్వొద్దనే హత్య చేసినట్లు ఒప్పుకున్నడు.
అన్నమయ్య: చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని సోమవారం మదనపల్లె మీదుగా అనంతపురానికి వెళుతున్న హోమ్ మంత్రి వంగలపూడి అనితను ఎమ్మెల్యే షాజహాన్ బాషా బైపాస్ రోడ్డులో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి తెలిపారు.
WNP: కొత్తకోట మున్సిపాలిటీ సమావేశ మందిరంలో కుటుంబ సమగ్ర సర్వే ఎన్యూమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. మదనాపూర్ రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. కుటుంబ సమగ్ర సర్వే విజయవంతం కావాలంటే ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ అవసరమని కలెక్టర్ అన్నారు.