యూట్యూబర్ హర్షసాయి మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తరపు లాయర్ నామాల శ్రీనివాస్ ఆరోపించారు. ‘హర్షసాయి బిజినెస్ పని నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చాడు. లైంగిక వేధింపుల కేసుకి అతని టూర్‌కి సంబంధం లేదు. విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అన్ని విషయాలు ఇప్పుడే చెప్పలేం. నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి’ అని పేర్కొన్నారు.
NLR: బుచ్చి నగర పంచాయతీ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నగర పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు కమిషనర్ సూచించారు.
అర్ధరాత్రి నిద్రలో మెలకువ రావడం సర్వసాధారణం. కానీ, ఇలా పదే పదే వస్తే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామందికి అర్థరాత్రి 12 గంటల కంటే ముందే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ, కొద్దిసేపటి తర్వాత మెలుకువ వస్తుంటుంది. ఒక్కసారిగా నిద్రలేచిన తర్వాత అస్సలు నిద్రపట్టదు. దీనికి కారణం అనారోగ్య సమస్యేనని అంటున్నారు. అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల మధ్యలో మెలుకువ వస్తే కాలేయ సంబంధిత సమస్యకు సంకేతమని అధ...
NRML: బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. సోమవారం నర్సాపూర్ జి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 32వ శాఖను వారు ప్రారంభించారు. ఖాతాదారులకు బ్యాంకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ బ్యాంకు చైర్మన్ శోభ, ప్రాంతీయ మేనేజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
AKP: కార్తీక మాసం నేపథ్యంలో నదులు, సముద్రాల వద్ద భక్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తుల రక్షణ కోసం పోలీసు బందోబస్తుతో పాటు గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. ఆలయాల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
NLG: నల్లగొండ మునిసిపాలిటీలో నిర్వహిస్తున్న సామాజిక-ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ, కుల సర్వే శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం పరిశీలించారు. సర్వే నిర్వహణలో ఖచ్చితత్వం, మార్గదర్శకాల అనుసరణ ముఖ్యమని కలెక్టర్ బృందాలకు సూచించారు. ఇళ్ల వద్ద డేటా సేకరణ సమయంలో సున్నితంగా, ఖచ్చితంగా సమాచారాన్ని సేకరించాలని ప్రోత్సహించారు.
ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 74 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి,ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరగా ఫిర్యాదు దారులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు.
AP: విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు మంత్రి దుర్గేశ్ పరామర్శించారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాలను కలుసుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సీఎం చంద్రబాబుకు మంత్రి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందేలా సీఎంతో మాట్లాడారు. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు.
AP: కరెంట్ షాక్ తగిలి చనిపోయిన మృతుల కుటుంబాలకు మంత్రి దుర్గేశ్ పరామర్శించారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాలను కలుసుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సీఎం చంద్రబాబుకు మంత్రి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందేలా సీఎంతో మాట్లాడారు. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో కరెంట్ షాక్‌తో నలుగురు మృత...
VZM: వరద బాధితుల సహాయార్ధం రూ 62,570 చెక్కును మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కు జిల్లా రైతు కూలి సంఘం అధ్యక్షులు సోమవారం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి రైతు సంఘాల అధ్యక్షులు, తదితర సభ్యులు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి లక్ష్ముము నాయుడు, ఎం.కృష్ణమూర్తి, బంటు దాసు పాల్గొన్నారు.
యాదాద్రి: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారిని డా. శిల్పిని భువనగిరి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక దంత వైద్య శిబిరాన్ని పరిశీలించి ప్రత్యేక సూచనలు చేశారు. ప్రజలు ప్రతి వారం జరిగే వివిధ రకాల ప్రత్యేక ఆరోగ్య శిబిరాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
NZB: TNGO నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సుమన్ ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా పెద్దోళ్ల నాగరాజును నియమించారు. ఈ సందర్భంగా వారిని టీఎన్జీవో రాష్ట్ర, జిల్లా నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, టీఎన్జీవో జిల్లా నాయకులు గైని గంగారాం, ఉమాకాంత్ ఉన్నారు.
HYD: రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ సచివాలయం వద్ద జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జాయింట్ వెంచర్లలో అనేక ఆస్తులు ఉన్నాయని, నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసి సమస్య పరిష్కరించి, ఆదాయం రాబట్టాలని ఆదేశించారు.
JGL: తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ముందస్తు అరెస్ట్ అయిన మాజీ సర్పంచ్‌లకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మద్దతు తెలిపారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచ్ల మధ్యలో కూర్చొని వారితో కలిసి ఆయన నిరసన తెలిపారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచ్‌ల బిల్లులను తక్షణం చెల్లించాలన్నారు.
ALR: DIG గోపీనాథ్ జెట్టి అరకు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ క్రైమ్ రికార్డులను పరిశీలించి, కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పర్యాటకుల భద్రతకై హోటల్స్, రిసార్ట్స్, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని SI గోపాలరావుకు తెలిపారు. గంజాయి, సారా దుష్ప్రభావాలపైన, మహిళలపై నేర నివారణకు రెగ్యులర్గా అవగాహణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.