• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రైతుల సాగు ఖర్చు తగ్గించాలి: సీఎం

AP: వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. ప్రకృతి సేద్యం – అగ్రిడీప్‌ టెక్‌ విధానంతో దేశానికి ఏపీ దిక్సూచి అవుతుందని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీతో 30 శాతానికి పైగా పురుగు మందు ఆదా చేయవచ్చని తెలిపారు. 95 శాతం సమయం, నీరు, పవర్‌ ఆదా చేసి ఖర్చు తగ్గించవచ్చని, డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు ...

November 5, 2024 / 12:14 AM IST

హిమాన్షు శుక్లాకు అదనపు బాధ్యతలు

ఏపీ ఫిల్మ్‌ టీవీ, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న హిమాన్షు శుక్లాకు ఫిల్మ్‌ టీవీ, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

November 4, 2024 / 11:28 PM IST

ప్రేమోన్మాది ఘాతుకం

TG: మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.  ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి చేతికి తీవ్ర గాయం అవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 4, 2024 / 11:14 PM IST

షూటింగ్‌లో గాయపడ్డ విజయ్‌ దేవరకొండ

హీరో విజయ్‌ దేవరకొండ గాయపడ్డాడు. తన కొత్త సినిమాలోని యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తనకు స్వల్ప గాయమయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఫిజియోథెరపీ పూర్తి అవ్వగానే మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం.

November 4, 2024 / 10:58 PM IST

అలాంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తునాయి: పవన్

AP: కెనడాలో హిందూ ఆలయంపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించేందుకు కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై వేధింపులు చూస్తుంటే ఆవేదన కలుగుతుందని పేర్కొన్నారు.

November 4, 2024 / 10:47 PM IST

అలాంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి: పవన్

AP: కెనడాలో హిందూ ఆలయంపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువులకు రక్షణ కల్పించేందుకు కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై వేధింపులు చూస్తుంటే ఆవేదన కలుగుతుందని పేర్కొన్నారు.

November 4, 2024 / 10:47 PM IST

మా ఇంటికి మోదీ రావడంలో తప్పులేదు: సీజేఐ

గణపతి పూజ సందర్భంగా తమ ఇంటికి ప్రధాని మోదీ రావడంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ప్రధాని రావడంలో తప్పులేదన్న ఆయన.. అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదన్నారు. ఇవి సామాజిక స్థాయిలో కూడా న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమావేశాలు కొనసాగుతున్నందున ఖచ్చితంగా తప్పు ఏమీ లేదని తెలిపారు. తాము రాష్ట్రపతి భవన్, గణతంత్ర దినోత్సవం మొదలైన వాటిలో కలుస్తామని పేర్కొన్నారు.

November 4, 2024 / 10:35 PM IST

ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక

ఖాతాదారులకు ఎస్‌బీఐ ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. స్కామర్లు మోసపూరిత సందేశాలను ఎస్‌బీఐ కస్టమర్లకు పంపిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని కొందరు మెసేజ్‌లను పంపిస్తున్నారని పేర్కొంది. ఇటువంటి మెసేజ్‌లను నమ్మి లింక్ మీద క్లిక్ చేస్తే మోసపోతారని హెచ్చరించింది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని స...

November 4, 2024 / 10:19 PM IST

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

దేశంలోని ప్రభుత్వరంగ సంస్థ, హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 17 ఎగ్జిక్యూటివ్ పోస్టులను షార్ట్ టర్మ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.hal-india.co.in/home ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 24, 2024 దరఖాస్తు...

November 4, 2024 / 10:08 PM IST

అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

TG: హుజూర్‌నగర్, కోదాడలో అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్షాకాలంలో 150 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా కులగణన జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షల ఆరోపణలు పసలేనివని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం తగదని.. అధికారులకు ప్రభుత్వం అండగా ...

November 4, 2024 / 09:57 PM IST

BRS పార్టీపై మంత్రి సీతక్క ఫైర్

TG: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ‘ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణమైంది. ఆర్థికశాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడే పెండింగ్‌లో పెట్టారని మాజీ సర్పంచులకు తెలుసు. సర్పంచుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడు బిల్లులు ఎందుకు చెల్లించలేదు? మీ హయాంలో పెండింగ్‌లో పెట్టిన రూ.580 కోట్లకు పైగా బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది’ అని ...

November 4, 2024 / 09:46 PM IST

2029 నాటికి అర్హులైన వారందరికీ ఇళ్లు: సీఎం

గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేలా కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

November 4, 2024 / 09:35 PM IST

ప్రధాని ట్రూడో ఒక ఇడియట్‌: మాజీ మంత్రి

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ అన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని ట్రూడో తీరుపై ఆయన మండిపడ్డారు. సామాజికంగా, రాజకీయంగా ప్రధాని ఒక ఇడియట్‌ అని ఘాటు విమర్శలు చేశారు. కెనడా విలువల కంటే గుర్తింపు రాజకీయాలకే ట్రూడో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.  గతంలో ట్రూడోతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

November 4, 2024 / 09:24 PM IST

త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతా: హోంమంత్రి అనిత

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘పవన్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. దాంట్లో కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతా’ అని ప...

November 4, 2024 / 09:19 PM IST

సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు

మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈనెల 6న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం కూడా ధ్రువీకరించారు. ‘ముడాకు సంబంధించి మైసూరు లోకాయుక్త నుంచి నోటీసులు అందాయి. ఈనెల 6న హాజరవుతా’ అని CM సిద్ధరామయ్య పేర్కొన్నారు.

November 4, 2024 / 09:13 PM IST