TPT: టీటీడీ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన బిఆర్ నాయుడు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:35కు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. 11 గంటలకు తన సొంత స్వగ్రామం పెనుమూరు మండలం పూనేపల్లికి వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 2:45కు తిరుమల చేరుకుంటారు. 3:20 గంటలకు తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకోనున్నారు.
E.G: అక్రమ కేసులతో వైసీపీ సోషల్ మీడియాను ఎవరూ ఆపలేరని అనపర్తి మాజీ MLA సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం అనపర్తిలోని సీఐ కార్యాలయంలో సీఐ సుమంత్‌ను కలిశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వీరభత్తుల చంద్రశేఖర్‌ను సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని నెపంతో పోలీస్ స్టేషన్‌కు రమ్మని నిర్బంధించడం అక్రమమని ఎమ్మెల్యే అన్నారు.
MLG: మంత్రి హరీశ్‌రావుకు డ్రామాలు ఆడడం బాగా అలవాటైపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆనాడు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు సర్పంచులకు బిల్లులు విడుదల చేయకుండా గడ్డి పీకారా అని ప్రశ్నించారు. హరీశ్‌రావు సర్పంచులందరిని వారి పార్టీ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారన్నారు.
BHNG: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు నేడు భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు అందరికీ పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగిందని, అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి ఇచ్చిన సర్వే ఫామ్ ప్రకారం పూర్తి సమాచారమిచ్చినట్లు తెలిపారు.
ప్రకాశం: బాపట్ల జిల్లా ఇంఛార్జి మంత్రిగా నియమితులైన మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా నియమించిన తర్వాత తొలిసారిగా బాపట్ల రానున్నారు. అనంతరం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను కలిసి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. డిస్టిక్ రివ్యూ కమిటీ (డిఆర్సి) మీటింగ్‌లో పాల్గొంటారు.
GNTR: డ్రైనేజీల మీద ఆక్రమణలను తొలగించాలని, ఆక్రమణలు పునరావృతమైతే సంబంధిత వార్డ్ సచివాలయ ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులదే భాధ్యతని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన అమరావతి రోడ్డులో ఆక్రమణల తొలగింపు, కంపోస్ట్ యార్డ్‌లో వ్యర్ధాల తరలింపు, ఏబీసీ సెంటర్‌లో వీధి కుక్కల ఆపరేషన్లు, అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.
KMM: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కా ప్రణాళికతో ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రకాశం: రీజనల్ కో- ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఈ రోజు ఉదయం 10:00 గంటలకు ఒంగోలు పార్టీ ఆఫీస్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు, MPPలు, ZPTCలు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
SKLM: ఇచ్చాపురం పట్టణంలో 23వ వార్డులో పలు సమస్యలను తీర్చాలని ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అశోక్ బాబుకు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా వార్డులోని సీసీ రహదారులు, మంచినీటి సరఫరా వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం దగ్గరలో ఉన్న వీధిలో 300 అడుగుల సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు.
CTR: పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు, కలికిరి మండలాల్లో మంగళవారం పర్యటించనున్నారు. కలికిరి ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటనలో తెలిపారు. అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
HNK: నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు పంజాబ్, అమృత్‌సర్‌లో నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ తైక్వాండో (పురుషుల) పోటీలకు జట్టును ఎంపిక చేసినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ క్రీడాకార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య తెలిపారు. వీరికి కోచ్ అండ్ మేనేజర్‌గా మహబూబాబాద్ వ్యాయమ కళాశాల అధ్యాపకులు కే.రమేష్ వ్యవహరిస్తారని తెలిపారు.
NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ నేడు ఉట్నూరు మండలంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో రూమ్ 2 రీడ్ ఆధ్వర్యంలో పాఠశాల లైబ్రరీని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10:30కు కేబి కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి ట్రైబల్ క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
HYD: డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ దరఖాస్తులు, రెవెన్యూ అంశాల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ధ్రువీకరణ పత్రాలు సత్వరమే అందించాలని సూచించారు.
MHBD: నేడు హైదరాబాద్లో జరిగే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన కోండ్ర ఎల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్ర నాయకత్వం, భవిష్యత్ కార్యచరణ, మాదిగ జాతి అభివృద్ధికై తీసుకోవాల్సిన వాటిపై చర్చిస్తామన్నారు.
NZB: జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) NVదుర్గా ప్రసాద్ హైదరాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డైట్ కళాశాల లెక్చరర్ పి.అశోక్‌ను నియమించారు.