ATP: ఈనెల 6న విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం SFI ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు సిద్ధార్థ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న వసతి దీవెన విద్య దీవెన 3,480 కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నివాసం(మార్కెట్ యార్డు) వద్ద మంగళవారం ఉదయం 9:30 గంటలకు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి CMRF చెక్కులను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ASR: వినికిడి పరికరాల నమోదు కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జమాల్ భాషా సోమవారం తెలిపారు. పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. వినికిడి పరికరాలు అవసరమైన వారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు.
CTR: పాలసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్యామల అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించునున్నట్లు తెలిపారు. కావున నాయకులు, అధికారులు, తదితరులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.
KDP: యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకూడదని జిల్లా టూరిజం అధికారి నాగభూషణం యువతకు పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్ర కడప సంస్థతో కలిసి డ్రగ్ అడిక్షన్ అండ్ ఏబ్యూజ్ అనే అంశంపై గోపవరం మోడల్ స్కూల్లో యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేడు యువత చెడు వ్యసనాలకు బానిసై తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు.
KMM: నేలకొండపల్లి మండలంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రపురం, పైనంపల్లి గ్రామాలలో పాలేరు ఏటి నుంచి అక్రమంగా ఇసుక రవాణాను కొందరు కొనసాగిస్తున్నారని వారిపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
TPT: సూళ్లూరుపేట నడిబొడ్డులో ఉన్న ప్రధాన రైల్వేగేటును సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే ఎస్ఎస్ఈ అధికారులు తెలిపారు. ఎల్సీ 60 రైల్వేగేటు మరమ్మతులతో పాటు గేటు వద్ద లైన్ల ఆధునికీకరణ, రిపేర్లు ఈ నాలుగురోజుల పాటు చేపట్టనున్నారు. ప్రజలు అసౌకర్యాన్ని మన్నించి సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
KDP: 68వ స్కూల్ గేమ్స్ బ్యాట్మెంటన్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రొద్దుటూరులో స్థానిక జార్జ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ అండర్ 19 రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చెందిన ఉమ్మడి 13 జిల్లాల నుంచి 130 మంది బాల బాలికలు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.
ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. కుళాయిల వద్ద మహిళలు తాగునీటి కోసం క్యూ కట్టిన దృశ్యాలు సోమవారం కనిపించాయి. కుళాయిల వద్ద మహిళలు బిందెలు తీసుకొని వంతులు వారీగా నీళ్లు పట్టుకున్నారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను మున్సిపల్ అధికారులు స్పందించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
KMM: పత్తి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు BRS పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మంగళవారం ఉదయం 8 గంటలకు వ్యవసాయ శాఖ మార్కెట్‌ను సందర్శించనున్నారు. వారితో పాటు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గుండాల కృష్ణ, BRS పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు.
KDP: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కడప జిల్లా 20వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బద్వేలులో వారు కరపత్రాలను విడుదల చేశారు. నవంబర్ 16,17,18 తేదీల్లో కడప నగరంలో నిర్వహిస్తున్న మహాసభలకు విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ మహాసభలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో వీఆర్ఎలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాలుగా వీఆర్ఎలకు వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా VRAల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇక ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని, హిందీలో మాత్రం నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సమాచారంపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ...
కడప: జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ సేవలు ప్రశంసనీయం, అభినందనీయమని ఇంఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో డీఆర్‌వో గంగాధర్ గౌడ్ జిల్లా నుంచి బాపట్లకు బదిలీ అయిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఎంతో మంది ఉన్నత అధికారుల మన్ననలను పొందారన్నారు. ఆయన బదిలీపై వెళ్లడం బాధాకరమని, ఉద్యోగ రీత్యా బదిలీలు సర్వసాధారణం అని అన్నారు.
SKLM: టెక్కలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ టి. గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకి అర్హులన్నారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.