• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి: మంత్రి

KMM: తిరుమలాయపాలెం మండలంలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో మండల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో పలు అభివృద్ది పనులపై సమీక్షించారు.

November 5, 2024 / 08:53 AM IST

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక అధికారి

KNR: ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి ఆర్.వి కర్ణన్ నియమితులయ్యారు. జగిత్యాల, పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. రేపటి నుంచి జిల్లాల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.

November 5, 2024 / 08:51 AM IST

భక్తులతో కిటకిటలాడుతున్న అంజన్న క్షేత్రం

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి వారిని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంగళవారం వేకువజాము నుంచే దర్శించుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారి సేవలో తరిస్తున్నారు.

November 5, 2024 / 08:51 AM IST

మ్యాన్ హోల్ తో వాహన రాకపోకలకు తప్పని ఇక్కట్లు

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని సూరాపాపిరెడ్డి చౌక్ వద్ద కూడలి నడిరోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ ప్రమాదకరంగ మారింది. మ్యాన్ హోల్ పై మూత లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇక రాత్రి సమయంలో అయితే వాహనదారులకు, పాతచారులకు మరింత ఇబ్బందికరం. మున్సిపల్ అధికారులు చొరవ చూపి మ్యాన్ హోల్ పై మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

November 5, 2024 / 08:50 AM IST

గ్యార్మీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

WGL: గ్యార్మీ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం..షేక్ ఖదీర్(50) మూడు దశాబ్దాల కింద హసన్‌పర్తి మండలం అనంతసాగర్ నుంచి బతుకు దెరువుకోసం వచ్చాడు. ఇక్కడ ముజేవార్ల వద్ద దర్గాలో జీతానికి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు.

November 5, 2024 / 08:50 AM IST

GREAT: TETలో 150కి 150 మార్కులు

AP: విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్‌ ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించారు. పేపర్‌-1ఏ(ఎస్జీటీ)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. 2014-16 మధ్య డైట్‌ పూర్తి చేసిన ఆమె.. వరుసగా ఐదు టెట్‌లకు పోటీపడ్డారు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో డీఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

November 5, 2024 / 08:50 AM IST

నైపుణ్య అభివృద్ధి శిక్షణతో నిరుద్యోగులకు జీవన భృతి

కృష్ణా: నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా నిరుద్యోగులకు జీవన భృతి కలుగుతోందని ఎంపీడీవో కార్యాలయ ఏ.ఓ. ప్రకాశ్ అన్నారు. కైకలూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సచివాలయ సిబ్బంది, ఎఎన్ ఏంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలలో నైపుణ్యం కలిగిన వారిని గుర్తించి, అవసరమైన శిక్షణ అందిస్తామన్నారు.

November 5, 2024 / 08:48 AM IST

వరంగల్ నుంచి పుష్‌పుల్ రైలు

WGL: పుష్‌పుల్(07463) రైలును రెండేళ్ల తర్వాత వరంగల్ రైల్వేస్టేషన్‌ వరకు పొడిగించారు. గతంలో ఈ రైలు వరంగల్- సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్న సమయంలో నడిచేది. అయితే మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా 2సం.ల నుంచి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. దీంతో వరంగల్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

November 5, 2024 / 08:43 AM IST

చిలమత్తూరు ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు

ATP: చిలమత్తూరు గ్యాంగ్ రేప్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ ఐజీ సీ.హెచ్ శ్రీకాంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పదే పదే నేరాలకు పాల్పడే నిందితులపై లోతైన నిఘా కొనసాగాలని, తీవ్రమైన నేరాలలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషిచేయాలన ఆదేశించారు.

November 5, 2024 / 08:42 AM IST

‘మెకానిక్ రాకీ’ నుంచి రెండో పాట వచ్చేస్తుంది

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఈ నెల 22న విడుదలవుతుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా.. తాజాగా రెండో పాట అప్‌డేట్ వచ్చింది. ‘ఐ హేట్ యు డాడీ’ అనే పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 4:5 గంటలకు ఈ పాట ప్రోమోను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రవితేజ ముళ్...

November 5, 2024 / 08:42 AM IST

వెలుగోడు రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం..

KNL: వెలుగోడు రిజర్వాయర్‌లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఆకుపచ్చ బ్లూ కలర్, లైట్ గోధుమ కలర్ రంగు ఫుల్ షర్టు వేసుకున్నారని, వీపు బాగాన చర్మం బొబ్బలు కలిగి ఉన్నాడని వెలుగోడు ఎస్ఐ విష్ణు నారాయణ తెలిపారు. సమాచారం తెలిసిన వారు వెలుగోడు పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని ఎస్ఐ కోరారు.

November 5, 2024 / 08:41 AM IST

రేపటి నుంచి సర్వే.. ఇవి దగ్గర ఉంచుకోండి..!

HYD: సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. 56 ప్రధాన, 19 అనుబంధ మొత్తం కలిపి 75 ప్రశ్నలుంటాయి. రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వేలో ఫొటోలు తీయడం, పత్రాలు అడగం వంటివి చేయరు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

November 5, 2024 / 08:41 AM IST

విజయవాడ వరద బాధితులకు గోల్డెన్ టెంపుల్ సహాయం

విజయవాడ వరద బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. మంగళవారం తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితులకోసం 5వేల వస్త్రకిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్‌ను చూపించారు. ఒక్కో కిట్ లోదుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని తెలిపారు.

November 5, 2024 / 08:40 AM IST

దుండగుడి వల్ల కాలు పోగొట్టుకున్నాడు..!

HYD: రైలు తలుపు వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తి కుడికాలు తెగిపోయిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ NGO కాలనీ రాఘవేందర్ నగర్‌కు చెందిన కార్ డ్రైవర్ దినేశ్(25) పనిపై HYDకు వచ్చాడు. సికింద్రాబాద్ నుంచి శాతవాహన ట్రైన్లో తిరిగి వెళ్తుండగా.. లాలాగూడ వద్ద రైలు పట్టాల పక్కనే ఉన్న దుండగుడు, దినేశ్ మొబైల్ లాగటంతో కిందపడి గాయాల పాలయ్యాడు.

November 5, 2024 / 08:40 AM IST

30 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

HYD: రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 30 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆల్ హుస్నా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మీర్చౌక్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎటువంటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడకూడదని రౌడీ షీటర్లను హెచ్చరించారు.

November 5, 2024 / 08:38 AM IST