• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. బైడెన్‌, ట్రంప్‌ పోస్ట్‌లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో.. ఓటర్లను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్‌లు చేశారు. ‘మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజకీయ ఘట్టానికి చేరువలో ఉన్నాం. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుకుందాం’ అని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘కమలా హారిస్ ట్రంప్‌ను ఓడిస్తుందని నాకు తెలుసు. అందుకు మీరంతా ఓటే...

November 5, 2024 / 08:35 AM IST

మరమ్మతులకు నోచుకోని రోడ్లు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించాలని వాహనదారులు కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జన్నారం మండలంలోని కిస్టాపూర్, కవ్వాల్, రోటిగూడ, తదితర గ్రామాలకు వెళ్లే రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ఆయా మార్గాలలో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగవచ్చని వారు వాపోయారు.

November 5, 2024 / 08:35 AM IST

‘రేషన్‌ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు’

TG: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు రేషన్‌ కార్డు లేకపోయినా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌ కార్డు ప్రామాణికమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

November 5, 2024 / 08:35 AM IST

తాండ్రంగిలో తాగు నీటి సమస్య.. పట్టించుకోని అధికారులు

VZM: జామి మండలం తాండ్రంగి గ్రామంలో కుమ్మరి వీధిలోని ప్రజలు కుళాయి నీరు కోసం విలవిలలాడుతున్నారు. వీధిలో వారు మాట్లాడుతూ.. కేవలం 2 బిందెలకు మాత్రమే నీరు అందుతుందని ఇళ్ళల్లో త్రాగు నీటి సమస్య చాలా ఎక్కువుగా ఉందని వాపోతున్నారు. చాలా రోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని త్వరగా ఎవరైనా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నారు.

November 5, 2024 / 08:31 AM IST

ఆసుపత్రి ముందు బైఠాయించిన గ్రామస్థులు

NRML: దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి ఫయాజ్ హుస్సేన్ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున జిల్లా ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ముందు బైఠాయించారు. విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబీకులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

November 5, 2024 / 08:31 AM IST

పల్నాడులో కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశం

GNTR: కాంగ్రెస్ జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజువారీ షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈనెల 6న బాపట్ల, పల్నాడు జిల్లాల నాయకులతో విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బాపట్ల, నరసరావుపేట జిల్లాల నేతలకు సమాచారం అందించారు.

November 5, 2024 / 08:30 AM IST

అమెరికాలో 9/11 తరహా దాడికి కుట్ర

అమెరికాలో 9/11 తరహా దాడికి ఓ ఉగ్రసంస్థ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. యూఎస్‌లోని భవనంపై దాడికి ఉగ్రసంస్థ అల్‌ షహబ్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కేసులో మాన్‌హట్టన్‌లోని ఫెడరల్ జూరీ చోలో అబ్ది అబ్దుల్లాను దోషిగా పేర్కొంది. అతడు ఓ విమానాన్ని హైజాక్‌ చేసి బిల్డింగ్‌పై దాడి చేయాలని చూశాడని కోర్టు రికార్డులు పేర్కొన్నాయి.

November 5, 2024 / 08:27 AM IST

తెలుగు గంగ కాలువలో బాలిక గల్లంతు..!

NLR: కలువాయి మండలం ఉయ్యాలపల్లి వద్ద తెలుగు గంగా కాలువలో బాలిక గల్లంతైనట్లు సమాచారం. కలువాయి ఎస్సీ కాలనీకి చెందిన బాలిక ఇంట్లో అలిగి బయటకు వచ్చేసింది. స్కూటీపై కాలువ వద్దకు వెళ్లి దూకినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాలువలో 10 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కాలువ వెంబడి కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు.

November 5, 2024 / 08:25 AM IST

నేటి నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభం

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. జనవరి 1 నుంచి 20 తేదీల మధ్య టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. కాగా.. పాఠశాల విద్యాశాఖ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 6 నెలలకోసారి టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

November 5, 2024 / 08:23 AM IST

ఖాళీ కడుపుతో ఉసిరికాయ తింటే..?

1. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.2. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.3. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.4. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.6. బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది.

November 5, 2024 / 08:20 AM IST

నకరికల్లు: నేటి ఎమ్మెల్యే ప్రజాదర్బార్ రద్దు !

GNTR: నకరికల్లులో ఈరోజు జరగాల్సిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కార్యాలయ అధికారులు తెలిపారు. అనివార్య కారణాల వలన కార్యక్రమాన్ని వాయిదా వేశామని అన్నారు. నకరికల్లు ప్రజలు విషయాన్ని గమనించాలని‌, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

November 5, 2024 / 08:19 AM IST

కైకలూరు: చేతబడి నెపంతో దాడి.. ఆరుగురిపై కేసు

కృష్ణా: కైకలూరు మండలం చటాకాయలో చేతబడి చేస్తున్నారన్న నెపంతో సైదు రఘుతోపాటు మరో ఇద్దరిని గ్రామస్థులు విచక్షణ రహితంగా కొట్టారు. ఇందులో సైదు రఘు తీవ్రంగా గాయపడగా.. మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ్యకు గాయాలయ్యాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

November 5, 2024 / 08:16 AM IST

న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ

NLG: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో లేబర్ డిపార్ట్‌మెంట్ సహకారంతో లేబర్ కార్డు ఉన్న స్త్రీ, పురుషులకు 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు నల్గొండ NAAC AD రమేష్ కుమార్ తెలిపారు.టైలరింగ్ ఎలక్ట్రీషియన్ తాపీ మేస్త్రి పెయింటింగ్ రంగాలలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ 15 రోజులకు రూ.4500ల ఉపకార వేతనం, స్టేషనరీ, సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు.

November 5, 2024 / 08:14 AM IST

నేడు రాంభద్రునిపల్లెలో గ్రామసభ: తహశీల్దార్

NDL: సంజామల మండల పరిధిలోని రాంభద్రునిపల్లెలో మంగళవారం గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. విస్తీర్ణంలో వ్యత్యాసాలు, LPMs, మ్యూటేషన్, ఖాతా, పేర్లలో, భూమి స్వభావంలో తప్పులతో పాటుగా, తదితర సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తామన్నారు.

November 5, 2024 / 08:10 AM IST

పెరిగిన చలి తీవ్రత

ASR: మన్యంలో చలి తీవ్రత పెరిగింది. శీతాకాలం ప్రారంభం కావడంతో క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం మంచు దట్టంగా కురుస్తున్నది. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు గ్రామాల్లో మంచు తెరలు విడటం లేదు. కాగా ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉంటుందని పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు.

November 5, 2024 / 08:09 AM IST