• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి

ప్రకాశం: ఒంగోలులోని కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎ.తమీమ్‌ అన్సారియాను యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌కు పూలబొకే అందజేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా యర్రగొండపాలెంలోని త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

November 5, 2024 / 10:45 AM IST

నూతన లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మభొజ్జు పటేల్ పాఠశాలలో నూతన లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేను చిన్నారులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు లైబ్రరీని సద్వినియోగం చేసుకుంటూ.. చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు.

November 5, 2024 / 10:45 AM IST

నవయుగ కాలనీలో చోరీ

WGL: నగరంలోని దేశాయిపేట రోడ్డులోని నవయుగ కాలనీలో చోరీ జరిగింది. పలువురు దుండగులు గత రాత్రి నవీన్ అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇంతేజార్ గంజ్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 5, 2024 / 10:43 AM IST

కెనడాలో ఆలయంపై దాడి.. భారీ ర్యాలీ

కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులు హిందూ ఆలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడులకు నిరసనగా బ్రాంప్టన్‌లో 1000 మందికిపైగా కెనడియన్ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. కెనడా, భారత్ జెండాలతో ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇలాంటి దాడులను కట్టడి చేయాలని కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

November 5, 2024 / 10:42 AM IST

మాచర్ల మెప్మా సమైక్య అధ్యక్షురాలిగా శివపార్వతి

PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సమైక్య సంఘాల అధ్యక్షురాలిగా మంజుల శివపార్వతి సోమవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో అధికారుల సూచనలతో మెప్మా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. 

November 5, 2024 / 10:41 AM IST

యోగా విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు

SKLM: యోగా సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వరుసగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి స్థానంలో నిలుస్తూ జాతీయ స్థాయికి ఎంపికైన సంపతిరావు ఆశిష్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అభినందించారు. పిన్న వయసులోనే జాతీయ నంది బాలరత్న అవార్డుతో పాటు, యోగ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం మన జిల్లాకే గర్వకారణం అన్నారు.

November 5, 2024 / 10:40 AM IST

పంపకాల్లో హెడ్ కానిస్టేబుళ్ల మధ్య గొడవ.. బదిలీ వేటు

WGL: ఓ ఫిర్యాదుదారుడి వద్ద తీసుకున్న డబ్బు విషయంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణ పడిన ఘటన వెలుగులోకి రావడంతో వారిపై బదిలీ వేటు పడింది. నెక్కొండ పోలీస్‌స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న మోహన్ నాయక్, సోమ్లా నాయక్ ఒక కేసులో ఓ వ్యక్తి నుంచి తీసుకున్న డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. దీనిపై సీఐ చంద్రమోహన్ విచారణ చేపట్టి బదిలీ వేటు వేశారు.

November 5, 2024 / 10:39 AM IST

46 మంది ఉద్యోగాల ఎంపిక

PLD: యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలను సులువుగా పొందవచ్చని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి తమ్మాజీరావు తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు మూడు కంపెనీలు హాజరై 68 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు చేశారు.

November 5, 2024 / 10:39 AM IST

ఊకల్ నాగేంద్ర స్వామికి ప్రత్యేక అలంకరణ

WGL: గీసుగొండ మండలంలో ప్రసిద్ధి ప్రఖ్యాతగాంచిన ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా స్వామివారిని బంతిపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు మాట్లాడుతూ.. ఇవాళ పుట్టలో పాలు పోసి, స్వామివారిని దర్శించుకుంటే సర్ప దోషాలు తొలగి సంతాన ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి జరుగుతాయని తెలిపారు.

November 5, 2024 / 10:38 AM IST

వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి

SKLM: వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సంతకవిటి ఎస్సై గోపాల్ రావు పేర్కొన్నారు. మంగళవారం రాజాం పాలకొండ రోడ్డులో సిబ్బందితో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల భారీ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు.

November 5, 2024 / 10:38 AM IST

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి: మంగా శ్రీను

GNTR: ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని గుంటూరు ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగా శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో ఆటో యూనియన్ నగర కౌన్సిల్ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. గడ్డిపాడు ఆటో యూనియన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మాతంగి మల్లేశ్వరరావు, దుండి దుర్గారెడ్డిని ఎన్నుకున్నామని ప్రకటించారు.

November 5, 2024 / 10:38 AM IST

‘గోర్ మేళాను విజయవంతం చేయాలి’

SRD: బంజారా జాతి ఐక్యతను చాటి చెప్పేందుకు ఈనెల 24, 25న నిర్వహించనున్న గోర్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బంజారా గోరుమేళ జిల్లా కమిటీ సభ్యుడు బంగారు రాజు అన్నారు. నారాయణఖేడ్ మండలంలోని గడ్డ తండాలో రాత్రి ఈ సందర్భంగా గోర్ మేళా కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి తండా నుంచి గిరిజన నాయకుడు, కారోబారి, యూత్ బృందం సభ్యులు పెద్ద ఎత్తున తరలిరావలని కోరారు.

November 5, 2024 / 10:38 AM IST

అమెరికాలో ఎన్నికలు.. కిమ్ క్షిపణి పరీక్షలు

అమెరికాలో ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా మిలిటరీ వెల్లడించింది. అటు జపాన్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఇదిలా ఉండగా.. గత వారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు స్వయంగా ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ సమక్షంలో జరిగిన ఈ ప్రయోగం దేశ భద్రతకు ముప్పు కలిగించే శత్రువుల ఎత్తుగడలకు ప్రతిస్పందన చర్య అని ఆయన అభివర...

November 5, 2024 / 10:37 AM IST

పత్తి మార్కెట్లో రైతుల ఆవేదన

KMM: ఖమ్మం పత్తి మార్కెట్‌లో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుకు వివరించారు. మార్కెట్లో పత్తి సరుకును కనీసం పరిశీలించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, ఇప్పటివరకు ఎంత పత్తి కొనుగోలు జరిగిందో వివరించాలని ఎమ్మెల్సీ అధికారులను ప్రశ్నించారు.

November 5, 2024 / 10:36 AM IST

గ్రామ పంచాయతీ సమస్యలను పరిష్కరించాలని సమ్మె

NZB: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్లు,వాటర్ మెన్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రేపు జిల్లాలో సీఐటీయూ(CITU)రాష్ట్రకమిటీ పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు మాక్లూర్ మండలం సీఐటీయూ కార్యదర్శి కొండ గంగాధర్ పిలుపునిచ్చారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

November 5, 2024 / 10:36 AM IST