• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆటో డ్రైవర్ల సమస్యలపై సమావేశం

ATP: గుత్తి పట్టణంలోని హంపన్న కార్యాలయంలో మంగళవారం ఏఐటీయూసీ, ఆటో యూనియన్ వర్కర్ల యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు, రజాక్ వలి ఆధ్వర్యంలో ఆటో వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆటో వర్కర్లకు నెలకొన్న సమస్యలను యూనియన్ దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని యూనియన్ తరఫున పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు.

November 5, 2024 / 01:01 PM IST

ప్రముఖ హీరోయిన్‌కి గాయం

తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి వరుస మూవీలు, సిరీస్‌లు చేస్తోంది. అయితే ఆమెకు గాయమైనట్లు, దాన్ని నిర్లక్ష్యం చేయడంతో గాయం తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె పోస్ట్ పెట్టింది. ‘కొన్ని నెలల క్రితం నాకు గాయమైంది. అయినా సరే షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దీంతో ఆ గాయం తీవ్రత పెరిగి.. మరింత బాధించడం ప్రారంభించింది. మళ్లీ ఆరోగ్యం కుదుటపడే వరకు అన్నింటికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుక...

November 5, 2024 / 01:00 PM IST

తాడేపల్లి MRO ఆఫీస్ వద్ద రాస్తారోకో

GNTR: తాడేపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వామపక్షాలు, సీఐటీయూ, వైసీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ.. సిమెంట్ కంపెనీ కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.

November 5, 2024 / 12:59 PM IST

కోడూరు: లింగన్నకొడు‌పై వంతెన ప్రారంభించిన ఎంపీ బాలశౌరి

కృష్ణా: కోడూరు మండలం నరసింహాపురం సమీపంలో లింగన్నకోడు మీడియం డ్రైనేజీపై నూతనంగా నిర్మించిన వంతెనను మంగళవారం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన రూ.18.40 లక్షల నిధులు, ఎంపీ బాలశౌరి ఇచ్చిన రూ.25 లక్షల నిధులతో ఈ వంతెన నిర్మించారు.

November 5, 2024 / 12:58 PM IST

సీఎం, అదానీ WELCOME ఫ్లెక్సీ వైరల్

HYD: రాహుల్ గాంధీకి స్వాగతం చెప్తూ పోస్టర్లు వెలిశాయి. కాగా అందులో అదానీ, CM రేవంత్‌రెడ్డి కలిసి స్వాగతం చెప్తున్నట్టుగా ఉన్న ఫ్లెక్సీలు పార్టీ నేతల్లో కలకం సృష్టించాయి. ప్రస్తుతం ఫ్లెక్సీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాహుల్ గాంధీకి వెల్‌కమ్ చెబుతూ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్ల ముందు ఇవి కనిపించడంతో చర్చనీయాంశంగా మారింది.

November 5, 2024 / 12:58 PM IST

మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

NLG: దేవరకొండ పట్టణంలో మంగళవారం మిషన్ భగీరథ నేటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణ శివారులోని బాపూజీ నగర్ వద్ద నీటి సంపు క్లీనింగ్ పనుల కారణంగా నేటి సరఫరా జరగదని పుర ప్రజలు గమనించి నీటి సరఫరాను జాగ్రత్తగా వాడుకోవాలని పేర్కొన్నారు.

November 5, 2024 / 12:57 PM IST

పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం లభ్యం

MBNR: కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం లభ్యమైంది. మండలంలోని కర్కాల్ పహాడ్ గ్రామ సమీపంలోనీ భారత్ పెట్రోల్ బంక్ వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఐ వరప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 5, 2024 / 12:56 PM IST

పారిశుద్ధ్య పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీతోనే-మీ-వెంటే కార్యక్రమం కింద పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళవారం 21వ డివిజన్లోని కోదండరామయ్య నగర్ 1వ లైన్ నుంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల అభ్యున్నతికి ఈ పనులు కీలకమని, శుభ్రతతో పాటు ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంగా ఇవి చేపడుతున్నట్లు తెలిపారు.

November 5, 2024 / 12:55 PM IST

ఫుట్ పాత్‌పై ఆక్రమణలు తొలగించండి: ఎమ్మెల్యే

NZB: నగరంలోని ఫుట్ పాత్‌పై ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్లపై కూరగాయలు, తోపుడు బండ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమవుతున్నాయన్నారు.

November 5, 2024 / 12:55 PM IST

డ్యాన్స్ పోటీ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు నవంబర్ 10న డివిజన్ స్థాయి డాన్స్ పోటీలకు సంబంధించినటువంటి పోస్టర్‌ను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ డ్యాన్స్ పోటీల్లో యువత ఉత్సహంగా పాల్గొన్నాలని ఆకాంక్షించారు.

November 5, 2024 / 12:54 PM IST

నాగేంద్ర స్వామి దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

KMM: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల నాగేంద్ర స్వామి దేవాలయాలకు మంగళవారం భక్తులు పోటెత్తారు. నేడు నాగుల చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి వచ్చి నాగేంద్ర స్వామికి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

November 5, 2024 / 12:54 PM IST

దీపాదాస్ మున్షీ పిటిషన్‌పై విచారణ వాయిదా

TG: BJP ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ గతంలో చేసిన ఆరోపణలపై AICC వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 5కు నాంపల్లో కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ జరగిన విచారణకు దీపాదాస్ మున్షీతోపాటు NVSS ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కేసులో ప్రభాకర్ పలుసార్లు కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇవాళ ఆయన...

November 5, 2024 / 12:53 PM IST

ఎల్‌వోసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

JGL: మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన సహిన భేగం కు మంజూరైన ఒక లక్ష రూపాయల విలువగల ఎల్‌ఓసి చెక్కును మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

November 5, 2024 / 12:51 PM IST

ప్రభుత్వ నిబంధులకు వ్యతిరేకంగా మద్యం షాపులు పెట్టొదు

NLR: అనంతసాగరం కేంద్రంలో మద్యం షాపులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి రెండవ మద్యం షాపును జనవాసాల మధ్య ఏర్పాటు చేసే ప్రయత్నలు చేస్తున్నారు. మహిళలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసిల్దార్‌కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం షాపు పెట్టవద్దని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.

November 5, 2024 / 12:51 PM IST

నాయుడుపేటలో కూరగాయల బండ్లు తొలగింపు

NLR: నాయుడుపేట పట్టణంలో గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఈక్రమంలో డీఎస్పీ చెంచుబాబు స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో అర్బన్ సీఐ బాబి, సిబ్బంది షాపుల బయట ఉంచిన ఫ్లెక్సీలు, కూరగాయల బండ్లను తొలగించారు. రోడ్డుకు అడ్డంగా ఎలాంటి కూరగాయలు బండ్లు పెట్టొద్దని సూచించారు.

November 5, 2024 / 12:51 PM IST