కృష్ణా: పోలీసు స్మృతిదినం సందర్భంగా మండల, జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలను పోలీసు శాఖ నిర్వహించారు. నాగాయలంకలోని స్కాలర్స్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థిని సునిధి పట్నాయక్ “యువత సైబర్ క్రైమ్ నివారణ పాత్ర” అన్న అంశంపై మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందగా, జిల్లా స్థాయి పోటీలో కూడా పాల్గొని మొదటి స్థానంలో నిలిచి పోలీసు అధికారుల ప్రశంసలను పొందారు.
KNL: పత్తికొండ బైపాస్ రోడ్డులో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇనుప, స్టీల్ హుండీ మరమ్మతులను శివ భక్తులు చేపట్టారు. ఇటీవల ఈ ఆలయంలో వరుస చోరీలు జరిగాయి. కార్తీక మాసం కావడంతో శివమాలధారులు, అయ్యప్ప మాలధారులు, ఆంజనేయ మాలధారులు, ఇక్కడ వంట చేసుకుని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారు స్పందించి హుండీలకు మరమ్మతులు పనులు చేపట్టారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘పుష్ప 2’. ఇది డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నెలరోజులే ఉందంటూ మేకర్స్ కొత్త పోస్టర్ షేర్ చేశారు. త్వరలోనే ట్రైలర్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ మూవీలో రష్మికా మందన్న, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్...
JGL: మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో మల్లన్న స్వామి ఆలయంలో భజన మండపానికి మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డ్ మెంబర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కృషితో 10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈరోజు రేగుంటలోని మల్లన్న స్వామి దేవాలయం వద్ద భజన మండపానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శంకుస్థాపన (భూమి పూజ) చేశారు.
పిజ్జా, బర్గర్, మెమోస్‌తో పాటు ఇచ్చే మయొనైజ్ విషతుల్యం కావటంతో ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. ఈ క్రమంలో మయొనైజ్‌కి ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవకాడో గుజ్జు.. శెనగలు, వెల్లుల్లి, తెల్ల నువ్వుల పొడితో చేసే క్రీమ్ వాడుకోవచ్చు. పైన్ నట్స్, చీజ్, ఆలివ్ నూనెతో చేసే క్రీమ్.. గ్రీక్ యోగర్డ్, పీనట్ బటర్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి రుచితో పాటు ఆ...
BNGR: తుర్కపల్లి మండల అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆలేరు MLA బీర్ల ఐలయ్యకి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. అత్యధిక గిరిజనులు కలిగిన మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను MLAకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన తనతో పాటు ఇతర నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.
ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ పాల్గొని పత్తి పంట విక్రయంలో తీసుకోవలసిన సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.
NRML: ఎలక్ట్రానిక్స్ స్కూటీ దగ్ధమైన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు, స్కూటీ యజమాని కృష్ణమూర్తి యాదవ్ వివరాల మేరకు గత రెండు సంవత్సరాల క్రితం ఎలక్ట్రానిక్ స్కూటీ ఓటీనోవ కొనుగోలు చేశారు. కాగా మంగళవారం తన ఇంటి ముందు పార్క్ చేసి ఉంచగా ఒక్కసారిగా శబ్దం వచ్చి దగ్ధమైందని తెలిపారు.
NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు వార్ల ఆధ్వర్యంలో మంగళవారం ఆశాడే సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కార్యక్రమం, ఆరోగ్య శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిస్తున్న అన్ని పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలన్నారు.
NZB: ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్స్ ధర్నా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో జరిగిన ధర్నాలో పెన్షనర్స్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు కమిటేషన్ రికవరీ 12 సంవత్సరాలకు కుదించాలని, వెల్నెస్ సెంటర్‌ను పటిష్ట పరచాలని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు.
ELR: కొయ్యలగూడెంలో ఉన్న బాల నాగేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పోలవరం ఎంఎల్ఏ చిర్రి బాలరాజు బాల నాగేంద్ర స్వామి వారికి అభిషేకం చేశారు. వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
SRPT: తుంగతుర్తిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతు సంక్షేమ కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన చెవిటి వెంకన్న యాదవ్‌ను ఘనంగా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ కొండ రాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమ్ము జోహార్, కోరుకొప్పుల నరేష్ గౌడ్, నవీన్, నరేష్, అబ్దుల్ పాల్గొన్నారు.
W.G: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను ఇళ్ల స్థలాలను అందిస్తామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. మంగళవారం భీమవరం మండలం వెంప గ్రామంలో అంజిబాబు కాలనీని ప్రారంభించి 56 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు.
సత్యసాయి: రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కలిశారు. మంగళవారం అనంతపురం పీటీసీలో జరిగిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డీజీపీని ఆమె కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో శాంతిభద్రతల అంశాలపై డీజీపీతో చర్చించారు.
W.G: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుంచి జంగారెడ్డి గూడెం రోడ్డులో కొత్త సర్వీసును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వీస్‌ను నడపనున్నట్లు నిర్వాహకుడు దాసి రాజారత్నం తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.