HNK: రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కుల గణనకు పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో అందరు సహకరించాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో సమస్యలను పరిష్కరణ ద్యేయంగా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ పాల్గొన్నారు.
KNR: గిరిజన విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం గిరిజన సంక్షేమశాఖపై సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ‘చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. హాస్టల్ విద్యార్థులంటే చులకన భావం ఉంటుంది. అవహేళన చేసేవారికి గుణపాఠం చెప్పేలా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి’ అన్నారు.
AP: రాష్ట్రంలో గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రంలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులను ఒప్పుకొంటున్నామని.. ప్రస్తుతం వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
GNTR: తిరువూరు మండలం రోలుపడిలో తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల ఈ రహదారిపై ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.
AKP: నాగుల చవితి సందర్భాన్ని పురస్కరించుకొని అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ వద్ద వేంచేసియున్న నాగమ్మ దేవత ఆలయాన్ని భక్తులు పలువురు సందర్శిస్తున్నారు. దేవతకు విశేష పూజలు అర్చనలు జరిపిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఒంగోలు మండలం గుత్తికొండ పాలెం నుంచి డంపింగ్ యార్డ్ వెళ్ళే దారిలో కాలువ మీద ఉన్న బ్రిడ్జి ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రతిరోజూ వేలాది ప్రజలు వివిధ పనులమీద ఈ రోడ్డు మీదుగా ప్రయాణాలు సాగిస్తుంటారు. చిన్న వంతెన కావటం వలన బ్రిడ్జి వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాలమైన వంతెనను నిర్మించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు
SKLM: బూర్జ మండలం డొంకలపర్త గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూముల రీ సర్వే రెవిన్యూ అవగాహన సదస్సు వెలవెలబోయింది. నాగుల చవితి పర్వదినం కావడంతో రెవిన్యూ అవగాహన సదస్సుకు గ్రామస్తులతో పాటు సంబంధిత శాఖ అధికారులు కూడా మధ్యాహ్నం 12 గంటలు అయినప్పటికీ పూర్తిస్థాయిలో హాజరు కాలేదని స్థానికులు తెలిపారు. అయితే సాయంత్రం వరకు సమయం ఉండడంతో వచ్చినవారు వేచి చూస్తున్నారు.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ దీపావళి కానుకగా రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా మేకర్స్ ఐదు రోజుల కలెక్షన్స్‌ను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ.61.4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.
KDP: రాయచోటిలోని గౌతమ్ హాల్లో ‘క’ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు. ‘క’ చిత్రం విజయోత్సవ సందర్భంగా రాయచోటి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో S.R కళ్యాణమండపం చిత్రం విజయోత్సవంలో మిమ్మల్ని కలుసుకున్నాను. ఇప్పుడు ‘క’ విజయోత్సవంలో ప్రేక్షకులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కాసేపు ప్రేక్షకుల మధ్య చిత్రాన్ని వీక్షించారు.
MDK: తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే, BRS జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. నార్సింగ్ మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడం విడ్డూరమని అన్నారు.
ప్రకాశం: కూటమి ప్రభుత్వం మహిళలు కోసం ప్రవేశపెట్టిన దీపం-2 పథకాన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే పరిమితం చేసిందని కాంగ్రెస్ పార్టీ దర్శి కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి రాగానే మాట తప్పారని విమర్శించారు.
ప్రకాశం: త్వరలో జరిగే డీఎస్సీలో ప్రకాశం జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 80 మాత్రమే ఉన్నాయని, వాటి సంఖ్య పెంచాలని డీవైఎఫ్ఎ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్జీటీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఉంటే.. కేవలం 80 పోస్టులు ఖాళీ ఉన్నట్లు చూపడం తగదన్నారు.
NLR: పొదలకూరు మండలం ఇరువూరు వద్ద కనుపూరు కాలువ సిల్ట్ పనుల పరిశీలనకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తన ఇంట్లో నుంచే కాకాణి మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ 11వ తేదీ పూర్తి అవుతుందని చెప్పారు.
ATP: గుత్తి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్న (8వ తరగతి), జ్యోతిలక్ష్మి (10వ తరగతి) విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఉషారాణి మంగళవారం చెప్పారు. రెండు రోజుల క్రితం అనంతపురంలో జరిగిన ఎంపికల్లో వీరిద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ HYD పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు సూటిగా ప్రశ్నలు సంధించారు. ‘రాహుల్ మీరు సందర్శిస్తున్న ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండి. మీ ప్రభుత్వం అశోక్ నగర్ ను ‘శోక్ నగర్’గా ఎలా మార్చిందో చ...