NLR: పొదలకూరు మండలం ఇరువూరు వద్ద కనుపూరు కాలువ సిల్ట్ పనుల పరిశీలనకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. తన ఇంట్లో నుంచే కాకాణి మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ 11వ తేదీ పూర్తి అవుతుందని చెప్పారు.
ATP: గుత్తి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్న (8వ తరగతి), జ్యోతిలక్ష్మి (10వ తరగతి) విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఉషారాణి మంగళవారం చెప్పారు. రెండు రోజుల క్రితం అనంతపురంలో జరిగిన ఎంపికల్లో వీరిద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ HYD పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు సూటిగా ప్రశ్నలు సంధించారు. ‘రాహుల్ మీరు సందర్శిస్తున్న ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండి. మీ ప్రభుత్వం అశోక్ నగర్ ను ‘శోక్ నగర్’గా ఎలా మార్చిందో చ...
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొప్పరం సజ్జపురం గ్రామంలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ADA శ్రీనివాస్ రావు హాజరయ్యారు. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
NLG: ప్రతి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను కోరారు. నల్గొండలో స్టేట్ సివిల్ సప్లై కమిషనర్ డి.ఐస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జేసీతో సమావేశంలో మంగళవారం మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
E.G: ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే వారి సమస్యలను ఆయా శాఖల అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
JGL: మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతంలో సాగర్ అనే యువకుడు సోమవారం రాత్రి మద్యం మత్తులో హోటల్ ముందున్న డ్రైనేజీలో పడి మృతి చెందాడు. సాగర్ కొంతకాలంగా మదీనా హోటల్లో పని చేస్తూ మద్యానికి బానిసై మత్తులో పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందాడు.
KMM: కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మంత్రి పొంగులేటితో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
TG: రాష్ట్ర యువతను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. అశోక్‌నగర్‌లో ప్రజాసర్కారు విద్యార్థులను కొట్టిన విషయం రాహుల్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో పది శాతం కంటే తక్కువే ఇచ్చారన్నారు. TSPSC ప్రక్షాళన అని కేవలం TGPSCగా పేరు మర్చారని.. జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
TG: రాష్ట్ర యువతను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. అశోక్‌నగర్‌లో ప్రజాసర్కారు విద్యార్థులను కొట్టిన విషయం రాహుల్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో పది శాతం కంటే తక్కువే ఇచ్చారన్నారు. TSPSC ప్రక్షాళన అని కేవలం TGPSCగా పేరు మార్చారని.. జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
NDL: అవుకు, కోవెలకుంట్ల మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 6న డోన్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు CDPO ఉమామహేశ్వరమ్మ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత విద్యా, అర్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆమె సూచించారు.
కృష్ణా: కృష్ణాజలాలను అందించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఫెర్రి నుంచి ఏ.కొండూరు వరకు యుద్ధ ప్రాతిపదికన పైపులైన్లను నిర్మిస్తుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా జి. కొండూరు బైపాస్ వద్ద నిర్మిస్తున్న పైప్ లైన్‌ను మంగళవారం ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు.
WNP: పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని బీఎస్పీ చిన్నంబావి మండల అధ్యక్షుడు బొల్లి కురుమయ్య మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 2 లక్షల 50 వేల ఓటర్లు ఉన్న నియోజకవర్గాలకు 3000 ఇండ్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి స్థలం లేక, పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో మదర్సాల చట్టాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో ములాయం సింగ్ హయాంలో ఈ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా, మదర్సాల చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు కు చెందిన...
ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ EV రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరిట EV బైక్‌ను లాంచ్ చేసింది. ఇది రెట్రో, ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఈ బైక్ 100-150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. LED హెడ్‌లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్‌లు, TFT డిస్‌ప్లేతో రానుంది. దీన్ని 2026లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్ల...