ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ EV రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరిట EV బైక్ను లాంచ్ చేసింది. ఇది రెట్రో, ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఈ బైక్ 100-150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. LED హెడ్లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్లు, TFT డిస్ప్లేతో రానుంది. దీన్ని 2026లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.