AKP: ఈ నెల 6 నుంచి 10 వరకు మహారాష్ట్రలోని బుస్వాల్‌లో జరగనున్న అల్ ఇండియా ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో నర్సీపట్నంకు చెందిన బొంతు మౌనిక పాల్గొననున్నారు. 80కేజీల విభాగంలో ఈమె పోటీలకు వెళుతున్నారు. ఇప్పటికే మౌనిక గౌహతిలో గోల్డ్ మెడల్, హర్యానాలో సిల్వర్ మెడల్ సాధించినట్లు శాప్ కోచ్ అబ్బు తెలిపారు.
ELR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల(స్కిల్ హబ్)లో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఇంఛార్జ్ అధికారి కిషోర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 130 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
SRD: రామచంద్రపురం శ్రీ సాయి నగర్ కాలనీలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ మంగళవారం బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. కాలనీలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శంకర్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్, ప్రకాష్, కుమ్మరి సత్యనారాయణ, శంకర్ ఉన్నారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఇవాళ తుది పోరు జరగనుంది. గెలుపు అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా డొనాల్డ్ ట్రంప్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఏకంగా 5 వేల మంది లాయర్లను నియమించుకున్నారని తెలుస్తోంది. 2020 ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు మాజీ అధ్యక్షుడు ఇది వరకే తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో అప్పట్లో ఆయన తరఫున పలు రాష్ట్రాల్లో వేసిన దావాలన్నీ తిరస్కరణకు గురైన విషయం త...
VSP: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా మంగళవారం నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తొలుత పుట్టను పసుపు, కుంకుమ, పువ్వులు చల్లి అలంకరించి ఆవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం చిమిడి, కోడి గుడ్లు, పాలు పోశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ 2016లో రమ్య అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకోగా.. వారిద్దరూ 2021లో విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న ఆయన.. ఓ లేడీ డాక్టర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట. ఈ మేరకు వచ్చే వారం నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
CTR: వైసీపీకి గుడ్ బై చెప్పిన కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తల్లోనే ఆయన టీడీపీ గూటికి చేరాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో వాయిదా పడింది. తాజాగా వైసీపీతో పాటు తన పదవి, కౌన్సిలర్ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారారు.
E.G: రాజమండ్రి సూపర్డెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రధాన కార్యాలయం వద్ద తూ.గో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు T.K విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపుతుందన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ASR: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనరల్ డీఎస్సీతో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం అరకులోయలో గిరిజనసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబరు-3కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
BDK: మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి గుండాల కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల నుంచి 100 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారని వైద్యులు సునీల్ తెలిపారు. కంటి ఆపరేషన్ల కోసం 50 మందిని నిర్ధారించినట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు నరేశ్, గౌరీ ప్రసాద్ పాల్గొన్నారు.
HNK: రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కుల గణనకు పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో అందరు సహకరించాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో సమస్యలను పరిష్కరణ ద్యేయంగా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ పాల్గొన్నారు.
KNR: గిరిజన విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. మంగళవారం గిరిజన సంక్షేమశాఖపై సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ‘చిన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. హాస్టల్ విద్యార్థులంటే చులకన భావం ఉంటుంది. అవహేళన చేసేవారికి గుణపాఠం చెప్పేలా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి’ అన్నారు.
AP: రాష్ట్రంలో గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రంలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులను ఒప్పుకొంటున్నామని.. ప్రస్తుతం వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మానవ హక్కులు, మహిళలు, చిన్నారుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
GNTR: తిరువూరు మండలం రోలుపడిలో తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల ఈ రహదారిపై ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.
AKP: నాగుల చవితి సందర్భాన్ని పురస్కరించుకొని అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ వద్ద వేంచేసియున్న నాగమ్మ దేవత ఆలయాన్ని భక్తులు పలువురు సందర్శిస్తున్నారు. దేవతకు విశేష పూజలు అర్చనలు జరిపిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు.