• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాచకులకు దుప్పట్ల పంపిణీ

NRML: నిర్మల్ పట్టణంలో మంగళవారం తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శీతాకాలం దృష్ట్యా యాచకులకు, నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు షేక్ ముజాయిద్ మాట్లాడుతూ.. యాచకులకు, నిరుపేదలకు ప్రభుత్వం శీతాకాలంలో సౌకర్యాలు కల్పించాలని కోరారు. పంపిణీ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు సాజీద్, ప్రధాన కార్యదర్శి అల్మాస్ తదితరులు పాల్గొన్నారు.

November 5, 2024 / 12:10 PM IST

‘వికాలాంగులకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి’

KMR: పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించకుంటే జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో సమావేశం నిర్వహించారు. వికలాంగుల ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరారు.

November 5, 2024 / 12:09 PM IST

ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా రాము ఎన్నిక

HYD: ఆర్యవైశ్య సంఘం దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షుడిగా గాదె రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దమ్మాయిగూడ సిద్ధార్థ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆర్యవైశ్య సంఘం సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వాల వైస్ ఛైర్మన్ వాస కిరణ్ కుమార్, జిల్లా పీఆర్ఓ కమిటీ ఛైర్మన్ రేణిగుంట మహేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉన్నారు.

November 5, 2024 / 12:07 PM IST

అసమర్థ నిర్ణయాలతో ఆదాయానికి గండి: KTR

TG: ప్రభుత్వం ముందుచూపు లేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి గండి పడిందని మాజీమంత్రి KTR అన్నారు. ‘BRS హయాంలో స్థిరాస్తి రంగం రయ్.. రయ్ మని పరుగులు పెట్టింది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై అంటోంది. పరిపాలన దక్షత లోపం.. విజన్ లేని ప్రభుత్వ విధానాల వల్లే సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర ఆదాయానికి జీవధారమైన రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా వేటు పడింది. దీంతో ఆదాయం సన్నగిల్లింది̵...

November 5, 2024 / 12:06 PM IST

గిరిజన సమ్మేళనానికి తరలిన మండల గిరిజనులు

KMM: ఖమ్మం నగరంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరుగుతున్న గిరిజన సమ్మేళన కార్యక్రమానికి కారేపల్లి మండల గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు.. అజ్మీరా శోభన్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన సమ్మేళన కార్యక్రమాల్లో గిరిజనులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

November 5, 2024 / 12:05 PM IST

గ్రామసభ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తాం: తహశీల్దార్

KNL: గ్రామసభ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామని తహశీల్దార్ శ్రీనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకడబూరులోని సొసైటీ ఆవరణలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యల సరి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమ భూ సమస్యలపై సరైన పత్రాలతో దరఖాస్తు సమర్పించాలని కోరారు.

November 5, 2024 / 12:05 PM IST

మంత్రాలయం మండలంలో ఆగని వలసలు

KNL: మంత్రాలయం మండలంలో ఉపాధి పనులు లేక ప్రజలు ఇతర రాష్ట్రానికి వలస వెళ్తున్నారు. మంగళవారం ఉదయం దాదాపు 40 మంది మాధవరం గ్రామం నుంచి ఉపాధి కోసం వలస వెళ్లారు. వారం రోజులుగా వలసలు మొదల్యాయి. మండలంలోని పలు గ్రామాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

November 5, 2024 / 12:04 PM IST

శ్రీశైలం అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

KNL: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి కర్ణాటక కొప్పల్‌కు చెందిన రక్ష సింధు నాగరల్లి రూ.1లక్ష విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామి, అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు, విరాళం బాండ్‌ను అందజేసి సత్కరించారు.

November 5, 2024 / 12:03 PM IST

‘సర్వే పూర్తయ్యే వరకు ఒంటిపూట బడులు’

KMM: సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యే వరకు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే తరగతులు ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్ తెలిపారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొంటారని చెప్పారు. బుధవారం నుంచి ఈనెల 22వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒక్కపూట మాత్రమే పనిచేస్తాయని డీఈవో స్పష్టం చేశారు.

November 5, 2024 / 12:02 PM IST

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

ప్రైవేట్ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీళ్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు 8:1 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా, ప్రైవేటు ఆస్తులను సహజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా ? లేదా అనే అంశంపై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.

November 5, 2024 / 12:01 PM IST

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కేజీబివి విద్యార్థినిలు

SRCL :రాష్ట్రస్థాయి ఉషు పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థిని డి. సోని బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యింది. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థిని దీపిక, 8వ తరగతి విద్యార్థిని మౌనికలు రజత పతకాలు సాధించారు. దీంతో వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు.

November 5, 2024 / 12:00 PM IST

నాంపల్లి కోర్టుకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్

TG: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇవాళ నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. గతంలో మున్షీపై బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణల కేేసులో ఇవాళ కేసు విచారణ జరగనుంది. ఈ మేరకు దీప్‌దాస్ కోర్టుకు వచ్చారు. ఆమెతో పాటు బీజేపీ నేత ప్రభాకర్ కూడా హాజరయ్యారు. కాగా, దీపాదాస్ ఓ రాజకీయ నేత నుంచి మెర్సిడెస్ కారును బహుమతిగా పొందారని ఓ టీవీ ఛానల్లో ప్రభాకర్ చేసిన ఆరోపణలతో ఆమె ఆతనిపై పరువు నష్టం [&...

November 5, 2024 / 11:59 AM IST

స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.16,700 ధర రాగా నేడు రూ.16,800లు ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.14,500లు ధర రాగా, ఈరోజు రూ.15వేల ధర పలికింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15 వేల ధర వచ్చిందని అధికారులు తెలిపారు.

November 5, 2024 / 11:56 AM IST

భారీ ధరకు ‘దళపతి 69’ ఓవర్సీస్ రైట్స్..!

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ హెచ్‌.వినోద్‌ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ ఫార్స్ ఫిల్మ్స్  దీని ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా.. బాలీవుడ్ నటుడు బాబీ...

November 5, 2024 / 11:55 AM IST

సీఎం వార్నింగ్‌పై స్పందించిన మంత్రి సుభాష్

AP: సీఎం చంద్రబాబు మంత్రి సుభాష్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మంత్రి సుభాష్.. ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో అలసత్వంపై చంద్రబాబు నన్ను హెచ్చరించారు. అందులో మంచిని తీసుకుని పనితీరుని మెరుగుపరుచుకుంటాను. నేను గతంలో వార్డు మెంబర్, కౌన్సిలర్ కూడా కాదు. అలాంటి నాపై నమ్మకంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా...

November 5, 2024 / 11:54 AM IST