ప్రైవేట్ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీళ్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు 8:1 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా, ప్రైవేటు ఆస్తులను సహజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా ? లేదా అనే అంశంపై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.