KNL: గ్రామసభ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామని తహశీల్దార్ శ్రీనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకడబూరులోని సొసైటీ ఆవరణలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యల సరి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమ భూ సమస్యలపై సరైన పత్రాలతో దరఖాస్తు సమర్పించాలని కోరారు.