వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వికీపీడియాలో కచ్చితత్వం లేని సమాచారం ఉందని అందిన ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపింది. అందులో పక్షపాతంగా సమాచారం ఉంటుందని పలువురు కంప్లైంట్ చేయటంతో కేంద్రం చర్యలు చేపట్టింది. కాగా, ఈ సంస్థ దేశానికి వ్యతిరేకంగా సమాచారాన్ని పొందుపరిచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కూడా గతంలో పలు జాతీయవాద సంఘాలు ఆరోపించిన విషయం తెలిసిందే.
ADB: విద్యార్థులకు పెండింగ్ రియంబర్స్‌మెంట్ డబ్బులను తక్షణమే విడుదల చేయాలని BRSV ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ… మంగళవారం ఉట్నూరు పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.
కెనడాలోని హిందూ దేవాలయాలపై నిన్న జరిగిన దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన కెనడా, భారత్ మధ్య.. అలాగే సిక్కు వేర్పాటువాదులు, భారత దౌత్యవేత్తల మధ్య ఉద్రిక్తతను పెంచిందని పేర్కొన్నారు.
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఓ హత్య కేసులో తుని రూరల్ పోలీసులు రాజాపై కేసు నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
సత్యసాయి: మడకశిర శాసనసభ్యులు ఎం.ఎస్ రాజు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనకి రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యులు పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
తమిళనాడులోని మీంజూర్ రైల్వేస్టేషన్ పరిధిలో మృతదేహం కలకలం రేపింది. నెల్లూరులో మహిళను హత్య చేసిన తండ్రీ, కూతురు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలు నుంచి బయటకు విసిరారు. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే సబర్బన్ రైలు నుంచి సూట్‌కేస్ విసిరేస్తుండగా రైల్వే పోలీస్ గమనించారు. దాన్ని తెరచి చూడగా.. లోపల డెడ్‌బాడీ ఉంది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి...
SKLM: శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి శ్రీకాకుళం వారిచే, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో బుధవారం మందస మండలం హరిపురం గున్నయ్య కాంప్లెక్స్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడనున్నదని క్యాంప్ జూనియర్ మేనేజర్ టి రామారావు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ శిబిరంలో అన్ని కంటి వ్యాధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించబడునని చెప్పారు.
ప్రకాశం: చీరాల మండలం విజయనగర్ కాలనీ నుంచి కారంచేడుకు వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో మంగళవారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలు సుమారు పదిమంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు సమాచారం.
SKLM: కంచిలిలో మంగళవారం CPM పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. పలాసలో ఈనెల 9,10 తేదీల్లో నిర్వహించబోయే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని శ్రీకాకుళం జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారన్నారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఇప్పటికే రెండు సార్లు వార్నింగ్‌లు వచ్చాయి. తాజాగా మరోసారి అదే తరహాలో సల్మాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
JGL: దాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అధికారులను ఆదేశించారు. మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, చిట్టాపూర్, సాతారం గ్రామాల్లో ఐకెపి వారి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం విక్రయానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.
AKP: ఈ నెల 6న నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత ధర్నా చేపడతామని మాజీ ఎమ్మెల్యే గణేష్ మంగళవారం తెలిపారు. గత నెలలో నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్‌లో ఇసుక దోపిడి జరుగుతున్నందున తమ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు వెళ్లి అడ్డుకున్నారన్నారు. అయితే పోలీసులు దోపిడి దొంగలకు అండగా ఉండి తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు.
VZM: విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నాయకుల చిత్ర పటాలు, వ్యక్తులకు సంబందించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను తక్షణమే తొలగించాలన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాపై దృష్టి సారించాలన్నారు. తనిఖీలు, సోదాలు చేసేటప్పుడు తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు.
ప్రకాశం: పొన్నలూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పి.సుజాత ఆధ్వర్యంలో నైపుణ్య గణనపై సచివాలయ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యువతీ యువకులు చదువుకుని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. వివిధ వృత్తుల్లో నైపుణ్యం పొందిన వారి సర్వే చేసి జాబితాను సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు.
WGL: స్టేషన్‌ఘనపూర్ MLA కడియం శ్రీహరి రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండరని ఆయన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు జరిగే కులగణన కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో కడియం శ్రీహరి హైదరాబాదులో ఉంటారని తెలిపారు. కావున నేడు(మంగళవారం), బుధవారం ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.