ASR: కొయ్యూరు మండలంలో నాగులచవితి పండుగను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం ఉదయం నుంచే మండలంలోని కొయ్యూరు, నడింపాలెం, పనసలపాడు, ఎం.మాకవరం తదితర గ్రామాల్లో ప్రజలు, భక్తులు పొలాల్లో పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పుట్టలో పాలు, గుడ్లు వేసి, తమను ఆపదల నుంచి కాపాడాలని నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమురం భీం ప్రాంగణంలో జరుగుతున్న గిరిజన క్రీడోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఎంతో ఆకట్టుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఏజెన్సీ ఐటిడిఎ ప్రాంతం మైదానం నుంచి విద్యార్థులు వచ్చి క్రీడోత్సవాల్లో పాల్గొన్నారు.
NLG: తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి పంటచేలు నేలమట్టమై ధాన్యం మొలకెత్తి రైతులను నిండా ముంచేసింది. మండలంలోని రామలింగాలగూడెం, పజ్జారు, తానేదారుపల్లి, కంకణాలపల్లి తదితర గ్రామాల్లో వరి చేను గింజ పాలు పోసుకునే దశలో కొంత పంట నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు.
SRD: పటాన్‌చెరు పరిధిలోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, ముత్తంగి గ్రామ పరిధిలోని ఎన్నం చెరువులను రూ.28.36 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. తిమ్మక్క చెరువు, సాకి చెరువు, ఎన్నం చెరువులను పరిశీలించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు డివిజన్ పరిధిలో చెరువులను పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నారు.
త్వరలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకుంటే సిరీస్ మొత్తానికి బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘ఒక కెప్టెన్ రోహిత్ సిరీస్ తొలి టెస్టు ఆడడం చాలా ముఖ్యం. అతడు అందుబాటులో లేకుంటే ఉపసారథి ఒత్తిడిలో పడతాడు. ఒకవేళ రోహిత్ ఆడడని వస్తున్న వార్తలు నిజమైతే.. సెలక్షన్ కమిటీ సిరీస్ మొత్తానికి బుమ్రాకు కెప్...
NLR: చేజర్లలో మహిళ మృతి కలకలం రేపింది. మండల కేంద్రంలోని శివాలయం దగ్గర గుర్తుతెలియని మహిళ మృతిచెంది ఉండటాన్ని స్థానికులు మంగళవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్ధాలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ ఎవరు? చనిపోవడానికి గల కారణాలు ఏంటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
మేడ్చల్: ఉత్తర హైదరాబాద్‌కు మెట్రో అత్యవసరం అని మేడ్చల్ మెట్రో సాధన సమితి అధ్యక్షుడు సంపత్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, శామీర్‌పేట, బోయిన్ పల్లి ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో 30 లక్షల మంది జనాభా ఉంది. దీంతో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
NLR: నాయుడుపేట విద్యుత్శాఖ AE వెంకటస్వామి, లైనింగ్ ఇన్స్స్పెక్టర్ శ్రీధర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పట్టణ సబ్ స్టేషన్, తుమ్మూరు సబ్ స్టేషన్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాబోయే వర్షాకాలంలో అందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా విద్యుత్ సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
SKLM: ఏలూరులో ఈ నెల 6,7 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు శ్రీకాకుళం విద్యార్థులు మంగళవారం బయలుదేరారు. ఇటీవల SGF ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్నామని SGF జిల్లా కార్యదర్శి బివి రవణ తెలిపారు. అండర్-14విభాగాల్లో బాల, బాలికలు 30 మంది ఎంపికయ్యారని అన్నారు.
NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో సోమవారం రాత్రి వెలుగు పథక ఏపీఎం సుధాకర్ వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు లార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి ప్రసాద్ లిటరసీ ఇండియా ట్రస్టు సౌజన్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
AP: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, చింతలపూడి, గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఆయన సమీక్షించారు. ఈఎన్‌సీ, ప్రాజెక్టుల సీఈలు, ఎస్‌ఈలు, మేఘా ఇంజినీరింగ్ ఏజెన్సీ ఈ సమీక్షలో పాల్గొన్నారు. పోలవరం డయాఫ్రం వాల్, ఎర్త్‌కమ్‌రాక్‌ఫిల్ నిర్మాణాలపై ఆరా తీశారు.
KMR: తలసేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందుకున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కామారెడ్డి రక్తదాతల ఆధ్వర్యంలో 2023-24లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 3,500యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసినందుకు ఈ పురస్కారం దక్కింది.
W.G: ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సోమవారం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌తో నలుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం మృతుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ మాజీ ఛైర్మన్ మేకా శేషుబాబు పరామర్శించారు. అనంతరం వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
RBI డిప్యూటీ గవర్నర్ పదవికి ఆర్థిక శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్రా పదవీకాలం 2025 జనవరి 14న ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రజా ఆర్థిక సంస్థలో 25 ఏళ్ల అనుభవం ఉండి.. 2025 జనవరి 15 వరకు 60 ఏళ్లకు మించి ఉండకూడదు. 2024 నవంబరు 30లోగా దరఖాస్తులు పంపించాలి. ఎంపికైన వ్యక్తి కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే ద్రవ్యపరపతి విధాన కమిటీ(MPC) సభ్యుడిగా వ్యవహరించా...
WGL: నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,910 ధర పలకగా నేడు రూ.10 పెరిగి, రూ.6920కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండు బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.