అర్ధరాత్రి నిద్రలో మెలకువ రావడం సర్వసాధారణం. కానీ, ఇలా పదే పదే వస్తే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామందికి అర్థరాత్రి 12 గంటల కంటే ముందే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ, కొద్దిసేపటి తర్వాత మెలుకువ వస్తుంటుంది. ఒక్కసారిగా నిద్రలేచిన తర్వాత అస్సలు నిద్రపట్టదు. దీనికి కారణం అనారోగ్య సమస్యేనని అంటున్నారు. అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల మధ్యలో మెలుకువ వస్తే కాలేయ సంబంధిత సమస్యకు సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి.