• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోదీకి కేరళ షాక్.. బీచ్ లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ( India: The Modi Question) దేశంలో వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్ లో నిషేధించిన డాక్యుమెంటరీని గణతంత్ర దినోత్సవం రోజు పలుచోట్ల వీక్షించారు. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించిన ఆయా చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణలోని హెచ్ సీయూలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడంతో వర్సిటీలో అలజడి మొదలైంది. రెండు విద్యార్థి సంఘాల మధ...

January 26, 2023 / 09:39 PM IST

‘యువగళం’:లోకేశ్‌కు కుప్పం గెస్ట్ హౌస్ వద్ద మహిళల హారతి

మరికొన్ని గంటల్లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కుప్పం నుంచి జరగనుంది. గురువారం రాత్రి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు లోకేశ్ చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. మహిళలు హారతి ఇచ్చి దిష్టి తీశారు. గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ సీనియర్ నేతలు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం పాదయాత్ర తొలిరోజు.. కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభకు 50 వ...

January 26, 2023 / 09:19 PM IST

పవన్ మరో కేఏ పాల్.. మంత్రి బొత్స సత్యనారాయణ విసుర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున పద్ధతిగా మాట్లాడతారు.. పవన్ అలా కాదన్నారు. సెలబ్రిటీ పార్టీ నేత మాత్రం సన్నాసి మాటలు మాట్లాడాడని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పిచ్చెక్కినట్టు మాట్లాడటంతో రియాక్ట్ కావాల్సి వస్తోందని తెలిపారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఓ సామెతను చెప్పా...

January 26, 2023 / 09:03 PM IST

13 లగ్జరీ బైక్ లు మాయం: లవ్ కోసం దొంగగా యువకుడు

ప్రేమ కోసం ఎంతటి సాహసమైనా చేయాలని అనిపిస్తుంది. ఇక మనసుకు నచ్చిన వాళ్లు చెబితే ఎంతటి పనులనైనా చేయడానికి వెనుకాడం. ఇక అమ్మాయి కోరితే అరక్షణంలో తీసుకుని ఇచ్చే ప్రియులు కూడా ఉంటారు. అట్లాంటి వ్యక్తే మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు. ప్రేయసి కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ప్రేయసి కోరిందల్లా తీసుకొచ్చి ఇచ్చేందుకు బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో ఆమె కోరికలన్నీ తీ...

January 26, 2023 / 08:50 PM IST

రిపబ్లిక్ డే స్పెషల్.. జిగేల్ మంటున్న పార్లమెంట్.. వీడియో

74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ భవనం జిగేల్ మంటోంది. సాయంత్రం కాగానే పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మొత్తాన్ని లైట్లతో ప్రకాశించేలా చేశారు. పార్లమెంట్ భవనం ముందు జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పుస్తకాన్ని ప్రదర్శించారు. కొన్ని నిమిషాల పాటు పార్లమెంట్ మొత్తం కళ్లు జిగేల్ మనేలా ప్రకాశించింది. పార్లమెంట్ భవనాల చుట్టూ లైట్స్ అమర్చ...

January 26, 2023 / 08:46 PM IST

కీరవాణి, చంద్రబోస్‌ను సత్కరించిన గవర్నర్ తమిళి సై

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీ అవార్డు వరించింది. ఎంఎం కీరవాణి, ఆ పాట రాసిన గీత రచయిత చంద్రబోస్‌ను గవర్నర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో...

January 26, 2023 / 08:46 PM IST

కార్ల షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని ఉధ్నా ప్రాంతంలో ఉన్న కార్ల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ మంటల్లో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న కొత్త కార్లన్నీ మంటలకు ఆహుతి అయిపోయాయి. భారీ అగ్ని ప్రమాదం వల్ల ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న లేచాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం ...

January 26, 2023 / 08:26 PM IST

గణతంత్ర దినోత్సవం వేళ బీహార్ లో ఎగిరిన పాకిస్తాన్ జెండా

ఇవాళ దేశమంతా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర పరేడ్ ను నిర్వహించారు. అందరూ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. సాయంత్రం అటారి, వాఘా బార్డర్ లోనూ బీటింగ్ రీట్రీట్ సెరమనీ జరిగింది. కానీ.. మన దేశంలో బీహార్ రాష్ట్రంలో పాకిస్తాన్ జెండా ఎగిరింది. పాకిస్తాన్ జెండా రెపరెపలాడటం స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్ లోని పుర్నియ...

January 26, 2023 / 08:11 PM IST

వైసీపీ నేత కారులో లిక్కర్ తరలింపు.. విచారిస్తున్న పోలీసులు

సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడ ప్రీమియం లిక్కర్, లేదంటే చీఫ్ లిక్కర్ దొరుకుతుంది. దీంతో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. పోలీసులకు సందేహాం కలిగి, పలు సందర్భాల్లో చెక్ చేస్తుంటారు. ఈ రోజు కడప జిల్లా ఖాజీపేట వద్ద తనిఖీ చేపట్టారు. కర్ణాటకకు చెందిన మద్యం భారీగా పట్టుబడింది. వైసీపీ నాయకుడి కారులో మద్యం దొరకడం విశేషం. బి.మఠం...

January 26, 2023 / 08:10 PM IST

జాగ్వార్ కారుకు జీ20 కలర్స్.. సూరత్ యువకుడి వినూత్న ఆలోచన

ఈసంవత్సరం జరగబోయే జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు సెప్టెంబర్ లో జరగనుంది. గత సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈసంవత్సరం మాత్రం భారత్ లో జీ20 సదస్సును నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సు జరగనుంది. ఈనేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ యువకుడు తన జాగ్వార్ కారుకు జీ20 కలర్స్ వేశాడు. అంతటితో ఆగకుండా సూరత్ నుంచి జాతీయ రాజధాని ఢిల్లీకి చ...

January 26, 2023 / 07:26 PM IST

తిరుపతిలో జెండా పండగ.. ఆకట్టుకున్న పోలీసుల కవాతు

  తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కలెక్టర్ శుభాకాంక్షలను తెలిపారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో త్యాగధనుల కృషి అని వివరించారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా...

January 26, 2023 / 07:21 PM IST

రాష్ట్రపతి భవన్ లో ‘ఎట్ హోమ్’.. మోదీ హాజరు

At Home : గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా, వైస్ ప్రెసిడెంట్ జగ్ దీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ వైస్ ప్రెసిడెంట్ హమిద్ అన్సారీ హాజరయ్యారు. Delhi: President...

January 26, 2023 / 06:54 PM IST

వాఘా బార్డర్ లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు.. వీడియో

భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత్, పాక్ మధ్య ఉన్న అటారి, వాఘా బార్డర్ వద్ద వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న ఈ బార్డర్ వద్ద బీటింగ్ రీట్రీట్ సెరమనీని నిర్వహించారు. ఈ వేడుకకు చుట్టుపక్కన ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేస్తారు. అటు పాకిస్థాన్ దేశం నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు దేశాల జాతీ...

January 26, 2023 / 06:22 PM IST

తెలంగాణ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానించింది: గవర్నర్

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్‌లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం. ‘ప్రజల మధ్య గణతంత్ర వ...

January 26, 2023 / 06:21 PM IST

శ్రావణి వెనక బీజేపీ.. ఫేస్‌బుక్ లైవ్ ఎందుకు ఇచ్చింది: సంజయ్

‘సంజయ్ దొర మీకు దండాలు, మున్సిపల్ చైర్మన్ పదవీకి రాజీనామా చేస్తున్నా’ అని నిన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. శ్రావణి ఆరోపణలపై అధికార పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి వెనక బీజేపీ నేతలు ఉన్నారని తిప్పికొట్టారు. ఈ విషయం కౌన్సిలర్లే తనకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఆమె రాజీనామా చేయగా బీజేపీ ఫేస్‌బుక్ లైవ్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఆమెను తాను వే...

January 26, 2023 / 06:08 PM IST