తెలంగాణ ప్రభుత్వం ముసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కింద నది తీరంలో ఆక్రమణకు గురైన స్థలాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలోని హైడ్రా కూల్చివేతలతో పాటు, ముసీ నది పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకారం, ముసీ నది ఒడ్డుకు సమీపంలో ఉండే మరియు FTL (full tank level ) పరిమితుల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయడం నిర్ణయించబడింది.
ప్రభుత్వ అధికారులు ఈ కూల్చివేత పనులపై ఇప్పటికే ప్రారంభించారు ఈ పరిధిలో దాదాపు 16,000 ఇళ్లు ఉన్నట్లు అంచనా వేయబడింది, వీటిలో అన్ని ఇళ్లు భవిష్యత్లో RB-X (Riverbed Extreme)గా గుర్తించబడనున్నాయి. ఈ ఉదయం, ప్రభుత్వ అధికారులు చాదర్ఘాట్ ప్రాంతం నుండి కూల్చివేత పనులను ప్రారంభించారు, అక్కడ సుమారు 140 ఇళ్లు ఖాళీ చేయబడ్డాయి. ఖాళీ చేసిన ఇళ్ళను నేలమట్టం చేస్తున్నారు.
కానీ, కొన్ని నివాసితులు ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా నిలబడారు. ప్రభుత్వ అధికారులతో గొడవలకు దిగుతున్నారు. అయితే, అధికారులు RB-X గుర్తింపు పొందిన ఇళ్ల నివాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి హైడ్రా గురించి ఒక సెక్షన్ ప్రజలకు మాత్రమే ఇబ్బంది అనుకుంటున్నా తరుణంలో మూసి పనులు ప్రారంభమయ్యేసరికి పేదలు, మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ గొడవలను ఎలా సద్దుమణిగిస్తాయో వేచి చూడాలి