AP: ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో కేసులు నమోదైన వేళ రాష్ట్రంలోని సీపీఐ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ ఒప్పందాల విషయంలో గత ప్రభుత్వానికి ముడుపులు అందాయని సైతం ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీపీఐ రామకృష్ణ కీలక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అదాని వ్యవహారంలో జగన్ సర్కార్కు ముడుపులు అందాయా? లేదా అనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.