తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు అక్కడి ప్రజలు తిరస్కరించారని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు మాని హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికలలో విజయం సాధించిన JMM, ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్‌కు అభినందనలు తెలిపారు.