AP: శ్రీ సత్య సాయి జిల్లాలో ఓ బాధితుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. కదిరి ఎమ్మార్వో కార్యాలయం వద్ద బట్టలు ఉతుకుతూ నిరసన వ్యక్తం చేశాడు. తన భూమి కొలతలు వేసి పాస్ బుక్ ఇవ్వాలని ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కొలతలు వేసేందుకు VRO లంచం అడుగుతున్నాడని బాధితుడు గంగులప్ప ఆరోపించాడు. స్థానిక వైసీపీ నేత, అధికారులు తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.