TG: రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే 90 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వే వివరాలను కంప్యూటీకరణ చేసే పనులు పలు జిల్లాల్లో ప్రారంభమయ్యాయని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. కొన్ని జిల్లాల్లో సర్వే పూర్తికాగా మరి కొన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తి అయిందని వెల్లడించారు. సర్వే డేటా నమోదులో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ వివరాల నమోదును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.