ఏనుగులు మనుషుల్లాగానే చాలా ఎమోషనల్గా ప్రవర్తిస్తాయి. కన్న బిడ్డలకు లేదంటే వాటి బంధువులకు ఏదైనా జరిగితే అవి అసలు తట్టుకోలేవు. అయితే తాజాగా ఓ ఏనుగు తన పిల్ల మృతిని జీర్ణించుకోలేక కొన్ని రోజులుగా మృతదేహన్ని ఈడ్చుకుంటూ తన వెంట తీసుకెళ్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి ఏనుగుకు వచ్చిన కష్టాన్ని చూసి నెటిజన్లు కంటతడి పెట్టుకున్నారు.