భోజనం చేసిన వెంటనే సోంపు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగాల నుంచి రక్షిస్తాయి. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది జీర్ణాశయ ఎంజైమ్లను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే, కడుపు ఉబ్బరం, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.