ఎన్నికల వేల తాము ఇచ్చిన హామీలను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. తాము అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలు రాష్ట్ర ఖజానాకు భారం మోపుతున్నాయని సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే ఈ కార్యక్రమాలను నిలిపివేయమని.. ఐదేళ్లపాటు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే దివాలా తీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించారు.