కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘాన్ని కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, రాజీవ్ రంజన్ సింగ్, వీరేంద్ర కుమార్, CR పాటిల్, AP, అస్సాం, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, UP సీఎంలకు చోటు లభించింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల అంశాలను అంతర్రాష్ట్ర మండలిలో చర్చించడానికి ముందు ఈ స్థాయి సంఘంలో చర్చిస్తారు.