TG: లగచర్ల ఘటనపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని BRS నేతలు చెబుతున్నారు. మాజీమంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు దాడులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. కేసీఆర్ బయటకు వచ్చి వెంటనే దీనిపై స్పందించాలి. పట్నం నరేందర్ KTRతో మాట్లాడినట్లు సమాచారం ఉంది. లగచర్ల ఘటనపై పోలీసు విచారణ జరుగుతోంది. నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేయక తప్పదు’ అని అన్నారు.