జమ్మూకశ్మీరుకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తప్పకుండా అవసరమని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. భూమి, సహజ వనరులకు సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు జమ్మూకశ్మీరుకు లభించాలంటే.. రాష్ట్ర హోదా కావాల్సిందేనని పేర్కొన్నారు. ఆర్థికంగా కశ్మీర్ ఎదగాలన్నా, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా రాష్ట్ర హోదా అత్యంత కీలకమన్నారు.