కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కేరళ సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతతత్వ సంస్థ ‘జమాతే ఇస్లామీ’ మద్దతుతో ఆమె వయనాడ్లో పోటీ చేస్తుందని సీఎం విజయన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రియాంక స్పందిస్తూ.. అభివృద్ధి వంటి వాస్తవ విషయాలపై రాజకీయ నేతలు మాట్లాడాలని హితవు పలికారు. కాగా, వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లౌకిక ముసుగు పూర్తి బట్టబయలైందని సీఎం పేర్కొన్నారు.