TG: ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా వరద బాధితుల సహాయార్థం ముందుకొచ్చింది. ఇవాళ బీవోబీ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.కోటి చెక్కును సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అందజేశారు. దీంతో సీఎం రేవంత్ వారిని అభినందించారు. వరద బాధితుల కోసం ఇప్పటికే సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు భారీ విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.