కోల్కతాలో 3 కొత్త మెట్రో కారిడార్లను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నోపారా నుంచి బిమాన్ బందర్ మెట్రో మార్గంలో 3 కొత్త కారిడార్లను ప్రారంభించి ప్రజలకు మోదీ అంకితం ఇవ్వనున్నారు. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ కారిడార్లకు జెండా ఊపనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం మమతా గైర్హాజరు కానున్నారు. ఈ మెట్రో కారిడార్ల ద్వారా విమానాశ్రయం సహా మరిన్ని ప్రాంతాలకు మార్గం సుగుమం కానుంది.