TG: ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయే చూపించాలని ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలలోని ఉచిత బస్సు ప్రయాణం, గ్రామీణ పేద ప్రజలకు శాపంగా మారిందన్నారు. వితంతువులకు కొత్త పెన్షన్స్ ఇవ్వడంలేదని, రైతులకు రైతు బంధు ఎక్కడని, కళ్యాణ లక్ష్మీ కింద ఇస్తామన్న తులం బంగారం ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. అలాగే మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఎవరికిచ్చారని,మీరిస్తానన్న ఇందిరమ్మ ఇళ్ళు జాడ యాడుందని ఆమె నిలదీశారు.