TG: హుస్నాబాద్‌లో కులగణన, సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని అన్నారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్పష్టం చేశారు. సర్వేలో వెల్లడించిన సమాచారం మొత్తం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈనెల 30 వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు.