ఆస్తమాకు బ్రిటన్ పరిశోధకులు సరికొత్త చికిత్స కనుగొన్నారు. మార్కెట్లో ఇప్పటికే ఉన్న బెన్రాలి జమాబ్ అనే ఔషధాన్ని ఇంజెక్షన్ మార్చినట్లు తెలిపారు. ‘ఒక్క డోసుతోనే రోగుల్లో అద్భుతమైన ఫలితాలొచ్చాయి. స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లలో ఆస్తమా చికిత్స మారలేదు. మా తాజా పరిశోధన కొత్త చికిత్సను తీసుకురానుంది. అత్యవసర సమయాల్లో ఆస్తమా రోగుల ప్రాణాలను కాపాడుతుంది’ అని పేర్కొన్నారు.