ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మస్క్, భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, దేశంలో సరసమైన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు, స్టార్‌లింక్ కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు పొందేందుకు మస్క్ కసరత్తు చేస్తునట్లు తెలుస్తోంది.