కోడిగుడ్డు మాత్రమే కాదు వాటిని ఉడికించిన నీళ్లతో కూడా చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పెంకులో సోడియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు ఉంటాయి. గుడ్డును ఉడకబెట్టినప్పుడు అవన్నీ నీటిలో కలిసిపోతాయి. ఆ నీరు మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. విత్తనాలు, మొక్కలు నాటేప్పుడు, సూర్యరశ్మి అందని మొక్కలకు ఈ నీటిని ఉపయోగించవచ్చు. పూల మొక్కలకు ఈ నీరు తెగుళ్లను ఎదుర్కొనే శక్తినిస్తుంది.