TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని ఆమె నివాసం వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిమజ్జనం వేడుకల్లో సునీత ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. వారిని BRS కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకుని సర్ది చెప్పారు.